నిజామాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని యువజన సంక్షేమ అధికారి శైలి కోరారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నగరంలోని పెద్ద రాం మందిరంలోని ఆలయ కోనేరు శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త సంచులతో మురికి కూపంలా మారిన కొనేరును గంట పాటు శ్రమించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా శైలి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన కోనేరు ఈ స్థితిలో ఉండడానికి మనమే కారణమన్నారు. ఇక నుంచైనా చెత్తను కుండీల్లోనే వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాలు
పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు భవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తారా..?: ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
పిట్లం, వెలుగు: నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతుంటే ఆటంకాలు కలిగిస్తారా.. అని బీజేపీ నాయకుల తీరుపై ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మండిపడ్డారు. ఆదివారం పిట్లంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ బీజేపీ చిల్లర పనులు చేయడం సిగ్గు చేటన్నారు. ఎదైనా మాట్లాడాలనుకుంటే పత్రికాముఖంగా చెప్పాలని, లేదంటే వినతి పత్రం ఇచ్చి నిర్మాణాత్మకమైన పోరాటం చేయాలన్నారు. అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో చిల్లర్గి, మహమ్మదాబాద్‌లో పీహెచ్‌సీల ఏర్పాటుకు మినిస్టర్ హరీశ్‌రావు హామీ ఇచ్చారని తెలిపారు. పిట్లం నుంచి మద్దెల్‌చెరు మధ్య మిగిలి పోయిన మూడున్న కిలోమీటర్ల రోడ్డుకు రూ. 7.5 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. పిట్లంలో పెద్దాసుపత్రి ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని గతంలో ఎన్ఆర్‌హెచ్ఎం కింద కేంద్రం రూ.2.5 కోట్లు మంజూరై తరువాత క్యాన్సిల్ అయ్యాయని తెలిపారు. మంత్రి హరీశ్‌రావు హాస్పిటల్ కోసం రూ.10.70 కోట్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. బిచ్కుందలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ వల్ల ఇక్కడి రోగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరికెల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ మండల ప్రెసిడెంట్ వాసరి రమేశ్, సొసైటీ చైర్మన్ శపథంరెడ్డి, విజయ్, జగదీశ్, నర్సాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
జీవన్‌రెడ్డి ఆర్మూర్‌కు చేసిందేమీ లేదు
నందిపేట, వెలుగు: ప్రచార ఆర్భాటం తప్ప ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిందేమీ లేదని మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ లీడర్ కంచెట్టి గంగాధర్ విమర్శించారు. ఆదివారం మండలంలోని బజార్ కొత్తూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టేందుకే జీవన్‌రెడ్డి ఎంపీ అర్వింద్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎంపీపై ఆరోపణలు చేసే ముందు ఆర్మూర్‌లో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రగతి పనులకు 50 శాతం ఫండ్స్ సెంట్రల్ నుంచే వస్తాయన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరె గంగాధర్, మండల పార్టీ అధ్యక్షుడు భూతం సాయారెడ్డి, భాస్కర్, జిల్లా కార్యదర్శి సురేందర్, నాగతారక్ పాల్గొన్నారు.
చలో ఢిల్లీని సక్సెస్ చేయండి
మాక్లూర్, వెలుగు: వర్గీకరణ బిల్లుకు చట్ట బద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి సల్లూరి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని దుర్గానగర్ సమీపంలోని గాంధీనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడుతూ వర్గీకరణ కోసం ఈనెల 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చలో ఢిల్లీ కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్, గాంధీనగర్ వాసులు పాల్గొన్నారు.
‘కొందరి కోసమే 100 ఫీట్ల రోడ్ల ప్రపోజల్’
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి టౌన్ కొత్త మాస్టర్ ప్లాన్ కొందరు స్వలాభం కోసం తయారు చేశారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆదివారం పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రూపొందించాల్సిన మాస్టర్ ప్లాన్ కొందరు వ్యక్తులకు మేలు చేసేలా, రైతులు, మధ్య తరగతి వారికి నష్టం చేసేలా ఉందన్నారు. టౌన్‌లో అవసరం ఉన్న చోట రోడ్లను కుదించారని, అవసరం లేని చోట మున్సిపాలిటీలో విలీన మైన గ్రామాల మీదుగా 100 పీట్ల రోడ్లు ప్రపోజల్ చేశారన్నారు. హౌజింగ్ బోర్డు కాలనీ నుంచి టెకిర్యాల్ శివారు వరకు ఉన్న మెయన్ రోడ్డు ( పాత హైవే)ను 200 పీట్ల నుంచి 150 పీట్లకు కుదించారని, జన్మభూమి రోడ్డు 80 పీట్ల రోడ్డును 60 పీట్లకు కుదించారని, జీవదాన్ నుంచి అఖిల హాస్పిటల్ నుంచి నవాబు వెంచర్ వరకు ఉన్న రోడ్డును కుదించి మాడిఫికేషన్ చేశారన్నారు. ట్రాఫిక్ఎక్కువగా ఉండే ఏరియాల్లో రోడ్లను కుదించాల్సిన అవసరం ఏమిటో కలెక్టర్, కమిషన్ సమాధానం చెప్పాలన్నారు.
దేవునిపల్లి, లింగాపూర్, టెకిర్యాల్ శివార్ల నుంచి 100 పీట్ల రోడ్లకు ఎందుకు ప్రపోజల్ చేశారని ప్రశ్నించారు. కొందరు లీడర్లు, వ్యాపారుల భూములు కొనుగోలు చేసి వాళ్ల వెంచర్ల కోసం 100 పీట్ల రోడ్లు ప్రపొజల్ చేశారని ఆరోపించారు. ప్రజలు, కౌన్సిలర్ల అభిప్రాయాలు తీసుకొకుండానే మాస్టర్ ప్లాన్ రూపొందించారన్నారు. కొత్త ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ స్పందించాలన్నారు. టౌన్ ప్రెసిడెంట్ విపుల్ జైన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్, కౌన్సిలర్లు సుజిత, మానస, నరేందర్, రవి, శ్రీనివాస్, ప్రవీణ్, లీడర్లు వెంకటి, వీరేశం, గురు మూర్తి, నరేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ రైతు దీక్షకు తరలిరావాలి
వర్ని, వెలుగు: పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించనున్న రైతు దీక్షకు రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాలరాజ్ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం కార్యకర్తలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ హామీ ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, ధరణి పోర్టర్ రద్దు, గిట్టు బాటు ధర తదితర సమ స్యలపై ఈ దీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, కోటగిరి ఎంపీటీసీ కొట్టాం మనోహర్, కోటగిరి మండల అధ్యక్షుడు షాహిద్, గంగా ప్రసాద్, చందూర్ ఎంపీపీ లావ ణ్య రాంరెడ్డి, దత్తు, వర్ని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, శ్రీహరి, గోవుర్ శ్రీనివాస్, దయానంద్, హరి, హన్మంత్‌రావు పాల్గొన్నారు.