ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలోని బీసీ హాస్టల్‌ లో 75 మంది స్టూడెంట్లు ఉన్నారు. పిల్లలు తాగేందుకు మినరల్‌‌ వాటార్ కోసం  మూడేండ్ల కింద వాటార్ పిల్టర్ ఏర్పాటు చేశారు. అది పట్టుమని నెల రోజులు కూడా పని చేయక మూలన పడింది. ప్రస్తుతం   రోజూ 4 నుంచి 5 వాటార్ క్యాన్లు బయట నుంచి తీసుకొస్తున్నారు. నెలకు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు ఖర్చవుతోంది. ఈ హాస్టల్‌‌లోనే కాదు జిల్లాలోని 26 హాస్టళ్లలో ఇదే పరిస్థితి.

కామారెడ్డి జిల్లాలో స్కూల్, కాలేజీకి సంబంధించి 26 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో గర్ల్స్, బాయ్స్‌‌ కలుపుకుని   2,100 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ఏ ఒక్క హాస్టల్‌‌లో కూడా సరైన వసతులు లేవు. ముఖ్యంగా తాగునీరు సరిగా లేవు. కామారెడ్డి టౌన్‌‌లోని 3 హాస్టళ్లలో వాటర్‌‌‌‌ ఫిల్టర్లు పనిచేయడం లేదు. లింగంపేట, గాంధారి, బీర్కూర్, ఎల్లారెడ్డితో పాటు ఇతర ఏరియాల్లోని హాస్టళ్లలో కూడా వాటర్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌ ఉంది. కొన్ని చోట్ల మిషన్లు తుప్పు పట్టాయి. పైపులు ఊడిపోయాయి.  కొద్ది రోజులు వాడిన తర్వాత ఫిల్టర్​చేసే కాయిల్స్ మార్చాలి. కానీ ఎక్కడా మార్చలేదు. రెగ్యులర్‌‌‌‌గా ప్రాబ్లమ్స్ రావడంతో   హాస్టల్ వార్డెన్లు వాటిని రిపేర్లు చేయించకుండా వదిలేశారు.    

బయట నుంచే సప్లయ్..​

చాలా హాస్టళ్లలో వాటార్ ఫిల్టర్లు మూలకు పడడంతో ప్రస్తుతం బయట నుంచి వాటార్ క్యాన్లను తెప్పిస్తున్నారు. ఒక్కో హాస్టల్‌‌కు రోజుకు 3 నుంచి 6 వరకు వాటర్‌‌‌‌ క్యాన్లు అవసరమవుతున్నాయి. సగటున రోజుకు నీళ్ల కోసం రూ. 50 నుంచి రూ.90 వరకు ఖర్చవుతోంది. జిల్లా వ్యాప్తంగా  నెలకు రూ. 50  వేల వరకు ఫిల్టర్ వాటార్ క్యాన్లు కొనటానికి ఖర్చు చేస్తున్నారు. అయితే ఆ వాటార్​క్యాన్లు  క్లీన్‌‌గా ఉండలేదని స్టూడెంట్లు చెబుతున్నారు. సమయానికి నీళ్ల క్యాన్లు రాకపోతే కొన్ని చోట్ల ట్యాంక్​నుంచి వచ్చే నీళ్లనే తాగుతున్నట్లు చెబుతున్నారు. దీంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. 

నీళ్లు సరిగ్గా ఉండవు

మా హాస్టల్‌‌లో వాటార్​ మిషన్​పనిచేయడం లేదు. తాగడానికి క్యాన్లు తెప్పిస్తున్నరు. ఈ నీళ్లు ఒక్కో రోజు సరిగ్గా ఉండవు. చెత్త కూడా వస్తది. క్యాన్ల నీళ్లు రాకపోతే బోరు నీళ్లు తాగుతాం. 
-రాజు, స్టూడెంట్, కామారెడ్డి

రిపేర్ చేయిస్తాం..

హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఫిల్టర్లు కొన్ని చోట్ల రిపేర్‌‌‌‌కు వచ్చాయి. అవి పనిచేయడం లేదనే స్టూడెంట్లకు బయట నుంచి  మినరల్‌‌ వాటార్‌‌‌‌ తెప్పిస్తున్నాం. త్వరలో ఫిల్టర్ మిషన్ల రిపేర్ చేయిస్తాం.
-శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌‌‌‌, కామారెడ్డి

15న ఉపాధి హామీపై సెమినార్

బోధన్, వెలుగు: ఈనెల15న హైదరాబాద్‌‌లో గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం నిర్వహించే సెమినార్‌‌‌‌ను  విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ  కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ప్రసాద్ కోరారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన వ్యవసాయ  కార్మిక సంఘం మహాసభలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కార్మికులకు రోజుకు రూ.600 నిర్ణయించి, కనీస వేతనాల జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరకుల ధరలను నియంత్రంచడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ రేటు పెంచడం లేదన్నారు. దేశంలోని 14 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నా ఈ పథకానికి నిధులు తగ్గించి నీరుగార్చలని చూస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు బకాయిపడిన రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.  15న జరిగే మీటింగ్‌‌కు కేరళ, తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ ఉపాధి హామీ శాఖల మంత్రులు ఎంబీ రాజేశ్‌‌, ఎర్రబెల్లి దయాకర్ హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యేశాల గంగాధర్, ఉపాధ్యక్షులు పి.లింగం, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధరప్ప పాల్గొన్నారు. 

మద్యం, డబ్బులేని రాజకీయాల కోసం పోరాడాలి

నిజామాబాద్, వెలుగు: మద్యం, డబ్బులేని రాజకీయాల కోసం యువత పోరాడాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం నగరంలోని ఎన్.ఆర్ భవన్‌‌లో ‘ఎన్నికలు రాజకీయ పార్టీల తీరు’ అనే అంశంపై  సదస్సు నిర్వహించారు. పార్టీ డివిజన్ కార్యదర్శి వేల్పూర్ భూమయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌లో పాపయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా వ్యాపారంగా మారాయన్నారు. ప్రజలను దోచుకోవడానికి నాయకులు పోటీ పడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిని మరచి కేవలం ఎన్నికల సమయంలో డబ్బును ఎరగా చూపి అధికారంలోకి వస్తున్నారన్నారు. దీనికి మునోగోడు ఎన్నికలే నిదర్శనం అన్నారు. అభ్యర్థులకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కూడా చూసీ చూడనట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మేధావులు ప్రశ్నించకపోతే రాజకీయ నేతలు నియంతలా మారి ప్రజలను బానిసలుగా చేస్తారన్నారు. సదస్సులో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.దాసు, జిల్లా నాయకులు కాజా మొహినుద్దీన్, పరుచూరి శ్రీధర్, జెల్ల మురళి, డి సాయిరెడ్డి, జేపీ గంగాధర్, రవి, ఎం.శివకుమార్, బి.నర్సయ్య, మోహన్, రాధ, పద్మ, సుప్రియ, సూర్య శివాజీ, పోశెట్టి పాల్గొన్నారు.

  • రోడ్డెక్కిన రైతన్నలు
  • వడ్ల కొనుగోళ్ల ఆలస్యంపై రైతుల ఆందోళన
  • విండో చైర్మన్‌‌కు వ్యతిరేకంగా నినాదాలు
  • గంటన్నర సేపు స్తంభించిన రాకపోకలు

లింగంపేట,వెలుగు: వడ్ల కొనుగోలు ఆలస్యంపై లింగంపేట మండలం శెట్పల్లి చౌరస్తాలో ఆదివారం రైతులు ధర్నాకు దిగారు. మండలంలోని పర్మల్ల, శెట్పల్లి, అయ్యపల్లి, మెంగారం గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది రైతులు ఎల్లారెడ్డి–కామారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. తాము 20 రోజులుగా వడ్ల కొనుగోలు సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నా.. కాంటాలు చేయడం లేదని, వేసిన బస్తాలను తరలించడానికి లారీలను పంపడం లేదని రైతులు మండిపడ్డారు. వడ్లను కొనుగోలు చేయడంలో జిల్లా సివిల్​సప్లయ్, కోఆపరేటివ్ ఆఫీసర్లు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. లింగంపేట సొసైటీ చైర్మన్ దేవేందర్‌‌‌‌రెడ్డికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించడంలో తహసీల్దార్ మారుతి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనిల్‌‌కుమార్‌‌‌‌ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పర్మల్ల గ్రామానికి చెందిన భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ అధ్యక్షుడు రాజాగౌడ్ ఆరోపించారు.​ జిల్లా సివిల్ సప్లయ్ డీఎంకు, డీసీవోకు సమస్యను వివరించినా స్పందన లేదని విండో డైరెక్టర్లు శ్రీకాంత్‌‌రెడ్డి, సిద్దిరాములు పేర్కొన్నారు. కాగా ఆందోళన తెలుసుకున్నా ఎస్సై శంకర్ అక్కడకు చేరుకుని రైతులను సముదాయించారు. అనంతరం రైతుల వద్దకు చేరుకున్న చైర్మన్​ దేవేందర్‌‌‌‌రెడ్డి రేపటి నుంచి లారీలను వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. 

హాస్టల్‌‌ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్ టౌన్, వెలుగు: మోడల్ స్కూల్ హాస్టల్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్‌‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్స్ ఎంప్లాయీస్ , వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మోడల్ స్కూల్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వర్కర్స్‌‌తో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 నుంచి మోడల్ స్కూళ్ల సిబ్బందికి రూ.7 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే వేతనాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వమే శ్రమ దోపిడీకి పాల్పడడం సిగ్గుచేటన్నారు. వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ హాస్టల్స్ ఎంప్లాయీస్, వర్కర్లు ప్రశాంతి, సుజాత, లత, జయలత, రజియా బేగం, లలిత, మహేశ్వరి, పద్మ, గంగవ్వ, సుకన్య 
పాల్గొన్నారు.

గ్రామస్థాయి వరకు కేంద్ర పథకాలు

కామారెడ్డి, వెలుగు: మారుమూల గ్రామాల్లోని వ్యక్తులకు కూడా కేంద్ర పథకాలు అందుతున్నాయని, ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనతేనని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి మండలం శాబ్ధిపూర్‌‌‌‌కు చెందిన పలువురు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేవైఎం స్టేట్ లీడర్ నరేందర్‌‌‌‌రెడ్డి  పాల్గొన్నారు.  

13న పద్మశాలి సంఘం ఎన్నికలు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఈనెల 13న ఆదివారం నిర్వహించనున్నట్లు ఆ సంఘం ఎలక్షన్ ఆఫీసర్లు ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆర్మూర్ టౌన్‌‌లో 786 ఓట్లు ఉన్నాయని చెప్పారు. అధ్యక్షుడి రేసులో అంబల్ల శ్రీనివాస్, మ్యాక మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శిగా ఘణపురం సంతోష్ కుమార్, కురికెళ్లి ఆత్మచరణ్, సంయుక్త కార్యదర్శిగా వాసం రాజు, గురుడు మురళి, మహేశ్‌‌ పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారని తెలిపారు. ఉపాధ్యక్షులుగా బత్తుల భాస్కర్, గురుడు రామచందర్ నామినేషన్లు వేయడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైందన్నారు. మీడియా సమావేశంలో పద్మశాలి ఎలక్షన్‌‌ ఆఫీసర్లు నర్సింహులు, ఆడెపు ప్రభాకర్, తాళ్ల హరిచరణ్, బాస మోహన్, పోలస రాములు, జ్ఞానేశ్వర్, సతీశ్‌‌ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ టీచర్లకు సన్మానం

కామారెడ్డి/భిక్కనూరు, వెలుగు: ఆవార్డు టీచర్స్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో  ఆదివారం పలువురు టీచర్లను జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌‌లో సన్మానించారు. టీచర్స్‌‌ డే సందర్భంగా ఇటీవల జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ టీచర్లుగా అవార్డు పొందిన వారిని అసోసియేషన్ తరఫున సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని విద్యా వేత్త హరస్మరణ్‌‌రెడ్డి పేర్కొన్నారు.  స్టూడెంట్లకు మరింత మెరుగైన విద్య బోధన అందించేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ మార బాల్‌‌రెడ్డి, కల్చరల్ సెక్రటరీ అంబీర్ మనోహర్‌‌‌‌రావు, వైస్​ ప్రెసిడెండ్లు రాంమోహన్, విష్ణువర్ధన్, ప్రమోద్ రాజు, దేవేందర్‌‌‌‌, విజయకుమారి, శివరంజని, ప్రతినిధులు గంగాకిషన్,  సిరిగాధ శంకర్ పాల్గొన్నారు.  

పెద్దకొడప్‌‌గల్‌‌కు చేరుకున్న రాహుల్​

కామారెడ్డి , వెలుగు: కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఆదివారం రాత్రి  కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌‌గల్‌‌కు చేరింది.  సంగారెడ్డి జిల్లాలో యాత్ర ముగిసిన వెంటనే నిజాంపేట, మాసన్‌‌పల్లి సమీపంలో కామారెడ్డి జిల్లా నేతలు రాహుల్‌‌ను కలిశారు. ఇక్కడి నుంచి వెహికల్‌‌లో రాహుల్, ఇతర నేతలు పెద్దకొడప్‌‌గల్‌‌కు చేరుకున్నారు. ఆయన వెంట పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే గంగారాం, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌‌రావు, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌‌చార్జి మదన్‌‌మోహన్‌‌రావు తదితరులు ఉన్నారు. రాహుల్‌‌ శిబిరం వద్ద రాష్ట్ర, జిల్లా లీడర్లు ఆయనను కలిశారు.