Brendon McCullum: ఇంగ్లాండ్ అధికార ప్రకటన.. మూడు ఫార్మాట్ లకు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్

ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్.. ఇప్పుడు అన్ని ఫార్మాట్ లలో కోచ్ బాధ్యతలను చేపట్టనున్నారు. మెకల్లమ్ టెస్ట్ లతో పాటు వైట్-బాల్ ఫార్మాట్‌లలో కూడా జట్టుకు కోచ్‌గా ఉంటాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి మాథ్యూ మోట్ స్థానంలో మెకల్లమ్ ఈ పదవిని చేపట్టనున్నారు.

"బ్రెండన్ మెకల్లమ్ అన్ని ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉంటాడు. టెస్ట్ జట్టుతో పాటు వన్డే, టీ20 ల్లో కూడా హెడ్ కోచ్ గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు స్వీకరిస్తాడు". అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వారి అధికారిక ప్రకటనలో తెలిపింది. మే 2022 నుండి 2027 చివరి వరకు మెకల్లమ్ తన ఒప్పందాన్నిపొడిగించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు తాత్కాలిక కోచ్ గా ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మార్కస్ ట్రస్కోథిక్ సేవలను అందిస్తున్నాడు.  

2023 వన్డే వరల్డ్ కప్ దారుణ ప్రదర్శన తర్వాత ఇంగ్లాండ్ కోచ్ పదవి నుంచి మాథ్యూ మోట్ రాజీనామా చేశాడు. అప్పటి నుంచి ఇంగ్లాండ్ తమ జట్టు కోచ్ పదవి కోసం ప్రయత్నాలు గట్టిగా చేసింది. శ్రీలంక మాజీ బ్యాటర్ కుమార సంగక్కర ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా వెళ్లనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మెకల్లమ్ ను ఆల్ ఫార్మాట్ కోచ్ గా ప్రకటించడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. 

"నేను టెస్ట్ జట్టుతో నా సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. వైట్-బాల్ ఫార్మాట్లకు నన్ను సిల్క్ గా ప్రకటించడం సంతోషంగా అనిపిస్తుంది.    ఈ కొత్త సవాలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జోస్ బట్లర్ బృందంతో కలిసి పని చేయడానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను." అని బ్రెండన్ మెకల్లమ్ అన్నారు.