LLC Auction: లెజెండ్స్ లీగ్ ఫస్ట్ రౌండ్ ఆక్షన్.. అమ్ముడుపోని స్టార్ ఆటగాళ్లు వీళ్ళే

సెప్టెంబర్ 20న మొదలయ్యే  లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ) మూడో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. శిఖర్ ధవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దినేశ్ కార్తీక్ తదితర 200 మంది క్రికెటర్లు బరిలో నిలిచిన ఈ టోర్నీలో ఆరు జట్లూ 25 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పోటీపడనున్నాయి. ఈ లీగ్ మెగా వేలం గురువారం (ఆగస్టు 29) జరుగుతుంది. తొలి రౌండ్ ముగిసేసరికి అమ్ముడుపోని ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం. 

శ్రీలంక తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్ వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్, ఆసీస్ మాజీ  టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్, ఆసీస్ మాజీ టీ20, వన్డే కెప్టెన్   ఆరోన్ ఫించ్, ఆసీస్ మాజీ ఓపెనర్ షాన్ మార్ష్, న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ మార్టిన్ గప్టిల్, బంగ్లా మాజీ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్, దక్షిణాఫ్రికా హషీమ్ ఆమ్లా, జింబాబ్వే ప్రోస్పర్ ఉత్సేయ,దక్షిణాఫ్రికా మాజీ బౌలింగ్ ఆల్‌రౌండర్ నిక్కీ బోజే,టీమిండియా మాజీ స్పీడ్ బౌలర్ ఆర్పీ సింగ్, ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ బ్రెట్ లీ, ఐర్లాండ్ మాజీ పేసర్ ట్రెంట్ జాన్స్టన్ లాంటివారు తొలి రౌండ్ లో అమ్ముడుపోలేదు.   

Also Read :- అప్పుడే బ్యాట్ పట్టిన భారత అండర్ 19 కెప్టెన్

న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ జెస్సీ రైడర్, ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ టిమ్ బ్రెస్నన్, ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్, దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ జస్టిన్ కెంప్, శ్రీలంక మాజీ ఓపెనర్ ఉపుల్ తరంగ,ఐర్లాండ్ మాజీ కెప్టెన్ విలియం పోర్టర్‌ఫీల్డ్,స్కాట్లాండ్ కాలమ్ మాక్లియోడ్, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అష్రాఫుల్, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ కు సైతం నిరాశ తప్పలేదు. వీరు తదుపరి రౌండ్ లో ఏమైనా అమ్ముడుపోతారేమో చూడాలి.