Brian Lara: '400' పరుగుల రికార్డ్ బ్రేక్ చేయడం ఆ ఇద్దరు భారత ప్లేయర్లకే సాధ్యం: బ్రియాన్ లారా

Brian Lara: '400' పరుగుల రికార్డ్ బ్రేక్ చేయడం ఆ ఇద్దరు భారత ప్లేయర్లకే సాధ్యం: బ్రియాన్ లారా

క్రికెట్ లో అసాధ్యమైన రికార్డులు అంటూ ఏమీ ఉండవు. టాలెంట్ ఉండాలి గాని సాధ్యం కానీ రికార్డ్ అంటూ ఏదీ ఉండదు. అయితే  కొన్ని రికార్డులు మాత్రం బ్రేక్ చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. వాటిలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా టెస్టుల్లో టెస్టుల్లో నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2004లో ఇంగ్లాండ్ పై లారా టెస్టుల్లో ఏకంగా 400 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్  విస్తుగొలిపేలా చేసాడు. 

టెస్టు క్రికెట్ లో అప్పటివరకు ట్రిపుల్ సెంచరీలు మాత్రమే చూసినవారు లారా 400 పరుగులు చేయడంతో ఔరా అనుకున్నారు. లారా చేసిన 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ 19 ఏళ్ళు దాటినా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ క్రమంలో ఒక్కరు కూడా లారా రికార్డ్ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. కనీసం 350 పరుగుల మార్క్ ఎవరూ టచ్ చేయలేకపోయారు. దీంతో లారా రికార్డ్ ఇక బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమని అందరూ భావించారు. 

ఇదిలా ఉండగా లారా తన రికార్డ్ ను బ్రేక్ చేయడం ఇద్దరు భారత ప్లేయర్లకే సాధ్యమని చెప్పుకొచ్చాడు. వారిలో ఒకరు ఓపెనర్ యశస్వి జైస్వాల్ కాగా.. మరొకరు శుభమాన్ గిల్.  "గిల్,జైస్వాల్ క్రీజులో కుదురుకుంటే చాలా రికార్డ్స్ బ్రేక్ చేయగలరు. తాను క్రికెట్ ఆడే టైమ్​లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య లాంటి కొందరు ప్లేయర్లు 400 మార్క్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. గిల్, జైస్వాల్ తో పాటు ఇంగ్లండ్ టీమ్​లో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ తన రికార్డ్ బ్రేక్ చేయగలరు". అని లారా అన్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)