మేడే రోజు కూడా తప్పని పని

మేడే రోజు కూడా తప్పని పని

నవీపేట్, వెలుగు: కార్మిక దినోత్సవం మేడే రోజున ఇటుక బట్టీలు, అంగన్వాడీ సెంటర్లు ఉపాధి హామీ కూలీ పనులు జరిగాయి.  కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులు ఎవరూ పని చేయకుండా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అయినా ఇటుక బట్టీల్లో మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన కార్మికులతో యాజమాన్యం యంచ గ్రామం వద్ద బుధవారం పని చేయించారు.  అంగన్‌ వాడీ  సెంటర్లు కూడా ఓపెన్ ఉండటంతో పాటు ఉపాధి హామీ పనులు కొనసాగాయి. దీంతో అధికారులు, లేబర్ ఆఫీసర్ల తీరుపై కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు.