
భారతదేశంలో సంప్రదాయాలకు .. వివాహ వేడుకలకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో వధూవరులు చేసే చిలిపి చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ పెళ్లి గురించి జనాలు చర్చించుకోవాలని.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా వైరైటీలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జనాలకు అలవాటై పోయింది.
ఒక్కోసారి సినీ స్టైల్లో వధూవరులు గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు అలానే ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వధువు .. తన సోదరుడి భుజాలపై పెళ్లి వేదిక దగ్గరకు రాగా.... వరుడు జేసీబీపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా వరుడు గుర్రం... కారు.. బండి ఇలా ఎవరి ఆచారం ప్రకారం వారు వస్తుంటారు. కాని ఈ వీడియోలో పెళ్లి చేసుకొనేందుకు వరుడు జేసీబీపై వచ్చాడు. దీంతో వివాహానికి వచ్చిన అతిథులు పగలబడి నవ్వారు.
వరుడు జేసీబీ రావడంతో .. పెళ్లికి వచ్చిన కొంతమంది ఫోన్ లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఒకరు సోదరా వరుడు గెలిచాడు అని రాయగా.. మరొకరు ఫన్నీగా పెళ్లికూతురు ఇప్పుడు హెలికాప్టర్ లో వస్తుందా అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఇంకొకరు JCBని తవ్వడానికి మాత్రమే కాకుండా వివాహ ఊరేగింపుకు కూడా ఉపయోగించవచ్చని నేను మొదటిసారి చూశానని రాసుకొచ్చారు.
ఈ రోజుల్లో ప్రజలు తమ వివాహాన్ని ప్రత్యేకంగా చేసుకోవడానికి వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. కొన్నిసార్లు వధువు పెళ్లి మండంపైకి డ్యాన్స్చేస్తూ రాగా.. వరుడు హెలికాప్టర్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి. కాని వరుడు జేసీబీపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ నవ్వించాడు.