Viral Video: వెడ్డింగ్​షూట్​.. పేలిన కలర్​ బాంబులు.. ఆస్పత్రిలో బెడ్డెక్కిన పెళ్లికూతురు

Viral Video:  వెడ్డింగ్​షూట్​.. పేలిన కలర్​ బాంబులు.. ఆస్పత్రిలో బెడ్డెక్కిన పెళ్లికూతురు

హైటెక్​ రోజుల్లో ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్​ జరిగినా అందరూ దాని గురించే చర్చించుకోవాలని వింత పోకడలకు జనాలు దారితీస్తున్నారు.  ప్రస్తుతరోజుల్లో వివాహ వేడుకల్లో కొత్త ప్రయోగాలు ... వింత పోకడలు..  పెరిగిపోతున్నాయి.వివాహ ఫోటోషూట్‌లో అందం కోసం విభిన్నమైన ఆలోచనలు అమలులోకి తెస్తున్నారు.   ఈ కాలంలో జరిగే పెళ్లిళ్లలో హంగామా అంతా ఇంతాకాదు.. పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్​ షూట్స్​.. ఆతరువాత వెడ్డింగ్​ షూట్స్​ సోషల్​ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. 

తాజాగా  కెనడాలో నివసించే భారతీయ దంపతులు బెంగళూరులో పెళ్లి చేసుకున్నారు.  ఆ తరువాత వెడ్డింగ్​ షూట్స్​ చేస్తూ .. అందరూ తమ గురించి చర్చించుకోవాలని వింత పోకడలకు దారితీశారు.  ఇది కాస్త.. రిసెప్షన్​ జరగకుండానే.. పెళ్లి కూతరు పియా కాస్త ఆస్పత్రి బెడ్​ ఎక్కాల్సి వచ్చింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో  వైరల్​ అయింది.

కెనడాలో నివసించే భారతీయ సంతతికి చెందిన విక్కీ.. పియా దంపతులు బెంగళూరులో పెళ్లి చేసుకున్నారు.  తమ పెళ్లిని అందరూ గుర్తుంచు కోవాలని పెళ్లికొడుకు.. పెళ్లి కూతురుని ఎత్తుకొని ఉండగా... బ్యాక్​గ్రౌండ్​ లో కలర్​ బాంబ్​లు పేలేలా ప్లాన్​ చేశారు.  ఆ ప్లాన్​ ప్రకారం వాటిని బ్లాస్ట్​ చేశారు. ఆ తరువాత అదికాస్త పెళ్లి కూతురు పియా  వీపునకు తగలడంతో  గాయమై.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  ఇంకా ఆమె జుట్టు కూడా కాలిపోయింది. 

విక్కీ.. పియా నవ దంపతుల రొమాంటిక్​ షూట్​ కాస్త విషాదంగా మారింది.  ఈ షాకింగ్ సంఘటనను విక్కీ & పియా అనే దంపతులు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 'వయాపారడైజ్'లో షేర్ చేశారు. వారి వివాహ ఫోటోషూట్ లో జరిగిన  ఘోర తప్పును పోస్ట్​ చేశారు.   ఈ వీడియోను మేము మా బిడ్డను కూడా తీసుకెళ్లబోతున్నామని క్యాప్షన్​ రాశారు.  ఇంకా నా పెళ్లి రోజున కాలిపోయిందని.. భావోద్వేగంగా పోస్ట్​ చేశారు.

ఈ వీడియోను ఇప్పటివరకు ( వార్త రాసే సమయానికి) 54 మిలియన్ల మంది వీక్షించి కామెంట్​ చేశారు.  ఇది విచారకర సంఘటన అని స్పందించారు.  మరొకరు మీ పెళ్లిపై చెడు కన్ను పడిందని కామెంట్​ చేశారు.  మరొక వినియోగదారుడు  చెడు కన్ను అనేది మూఢ నమ్మకం అంటూ... సరైన సేప్టీ ప్రికాషన్స్​ తీసుకోలేదని రాసుకొచ్చారు.. 

ఇటీవలి కాలంలో వివాహ వేడుకల్లో ఫోటోషూట్‌ కోసం పటాకులు, పొగ బాంబులు, ఇతర రసాయన పదార్థాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారు.అయితే, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా వీటిని ఉపయోగించడం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది.