మాకు పెళ్లి చేయండి స్వామీ : బ్రహ్మచారుల ఆలయాల పాదయాత్ర

కర్ణాటకలో బ్రహ్మచారి యువతకు పెద్ద కష్టమే వచ్చి పడింది. వయసొచ్చింది.. పెళ్లి చేసుకుందామంటే..అమ్మాయిలు దొరకడం లేదని తెగ బాధపడుతున్నారు అక్కడి బ్రహ్మచారులు. జోడీ కోసం జోళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతుందట..కర్నాటకలో పెళ్లి కూతుళ్ల సంక్షోభం తారాస్థాయికి చేరిందట.

ముఖ్యంగా అక్కడి రైతు కుటుంబాల్లో పెళ్లీడుకొచ్చిన యువకుల పెళ్లి పెద్దటాస్క్ గా మారిందంటున్నారు. ఈక్రమంలో ఓ నిర్ణయానికి వచ్చారు. వధువులను పొందేందుకు దైవిక జోక్యం అవసర మని.. కర్నాటక రైతులు డిసెంబర్ లో మండ్యలో ఓ పుణ్య క్షేత్రానికి పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. 
డిసెంబర్ లో అఖిల కర్ణాటక బ్రహ్మచారిగల సంఘం ఆధ్వర్యంలో ఆది చుంచనగిరి మఠం వద్దకు మాండ్య బ్రహ్మచారులు కవాతుగా వెళ్లనున్నారు. ఆదిచుంచనగిరి పీఠాధిపతి నిర్మలానందనాథ స్వామిని కలిశామని, యాత్రకు దర్శ సమతించామని, వధువు సంక్షోభంపై సమాజంలో అవగాహన కల్పించడమే లక్ష్యం అని సంఘం వ్యవస్థాపకులు కేఎం శివప్రసాద్ అంటున్నారు. గత ఫిబ్రవరిలో చామరాజనగర్ జిల్లాలోని ఎంఎం హిల్స్ ఆలయానికి పాదయాత్రగా వెళ్లారు కర్ణాటక రైతులు. 

ALSO READ :- అయ్యప్ప మాలలో ఉండి చెప్పులు వేసుకున్న బండ్ల గణేష్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్