ఏంటండీ ఈ ఘోరం : ఫస్ట్ నైట్ బీరు, గంజాయి అడిగిన కొత్త పెళ్లాం.. షాక్ లో పారిపోయిన పెళ్లి కొడుకు

ఏంటండీ ఈ ఘోరం : ఫస్ట్ నైట్ బీరు, గంజాయి అడిగిన కొత్త పెళ్లాం.. షాక్ లో పారిపోయిన పెళ్లి కొడుకు

కలియుగం అంటే ఏంటో అనుకున్నాం.. కొన్ని కొన్ని వార్తలు వింటున్నప్పుడు నిజమే అనుకోవాలి.. లేకపోతే ఏంటండీ ఈ విడ్డూరం.. కొత్త పెళ్లి చేసుకుని.. ఫస్ట్ నైట్ వరకు వచ్చిన తర్వాత.. కొత్త పెళ్లి కూతురు పెట్టిన డిమాండ్ విని అందరూ అవాక్కయ్యారు.. మనమే ఇలా ఫీలయితే.. ఈ పెళ్లి కొడుకు.. ఆ ఫ్యామిలీ ఇంకెంత షాక్ లో ఉండాలి.. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరన్ పూర్ గ్రామం. రెండు రోజుల క్రితం అంటే.. 2024, డిసెంబర్ 17వ తేదీ పెళ్లి జరిగింది. అమ్మాయి ఇంటి దగ్గర పెళ్లి జరగ్గా.. కొత్త జంట అబ్బాయి ఇంటికి వచ్చింది. ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. సహజంగా ఫస్ట్ నైట్ అంటే స్వీట్స్, పాలు, పండ్లు ఉంటాయి.. ఇక్కడ వెరైటీ.. కొత్త పెళ్లి కూతురు పాలు వద్దు బీరు కావాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత గంజాయి అడిగింది.. అంతేనా మేక మాంసం అడిగింది. మొదట బీరు కావాలని అడిగితే.. ఏదోలే తెద్దాం అనుకున్నాడంట కొత్త పెళ్లి కొడుకు.. దాంతో పాటు గంజాయి, మేక మాంసం కావాలని.. అప్పుడే ఫస్ట్ నైట్ అని చెప్పటంతో.. కొత్త పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు.

కొత్త పెళ్లాం డిమాండ్లను ఇంట్లో చెప్పటంతో.. రచ్చ రచ్చ అయ్యింది. ఆ రాత్రి ఫస్ట్ నైట్ కాదు కదా.. కాళ రాత్రి అయ్యింది. ఒకటే గొడవ. తీరా పంచాయితీ ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరింది. కొంపలో పంచాయితీ.. పోలీస్ స్టేషన్ లో పెట్టొద్దు.. మీరు మీరు ఇంట్లోనే తేల్చుకోండి అంటూ ఇద్దరికీ సర్దిచెప్పి ఇంటికి పంపించారంట.

ఇంట్లోనూ పెద్ద పంచాయితీ. బీరు తాగే పెళ్లాం అయితే పర్వాలేదు కానీ.. గంజాయి కొట్టే పెళ్లాం వద్దంటే వద్దు అంటూ కొత్త మొగుడు ఇంట్లో నుంచి ఏకంగా పారిపోయాడంట. కొత్త పెళ్లి కూతురు కూడా చేసేది లేక తిరిగి తన పుట్టింటికి వెళ్లిందంట.. 

ఫస్ట్ నైట్ పాలు కాదు బీరు.. సిగరెట్ కాదు గంజాయి.. స్వీట్స్ కాదు మాంసం.. ఈ రేంజ్ లో ఉన్నారా అమ్మాయిలు.. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఫస్ట్ నైట్ అంటే డ్రగ్స్.. ఫస్ట్ నైట్ పబ్స్.. ఫస్ట్ నైట్ అంటే బీచులు అనే స్థాయికి రావటంలో ఆశ్చర్యం లేదులేండీ అని నోరెళ్లబెడుతున్నారంట ఊర్లో జనం.. ఏం చేస్తాం అంతా కలికాలం మహిమ అంటున్నారు పెద్దోళ్లు..