
శివ్వంపేట, వెలుగు: పెళ్లైన 15 రోజులకే వదువు అదృశ్యమైన సంఘటన శివ్వంపేట మండలం సికింద్లాపూర్లో బుధవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన నవీన్ కు అక్షయతో గత 15 రోజుల కిందే పెళ్లి జరిగింది. రోజు మాదిరిగానే ఈనెల 14న ఇంట్లో అందరూ భోజనం చేసి నిద్రపోయారు. 15న ఉదయం లేచి చూసే సరికి ఇంటి డోర్లు తెరిచి ఉండగా, అక్షయ (19) కూడా కనపడలేదు.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు అక్షయ మామ వెంకటేశ్పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.