మరో నాలుగు గంటల్లో పెళ్లి.. పెళ్లి మండపానికి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతోపాటు బంధువులు అందరూ వచ్చారు.. డెకరేషన్ అదిరింది.. భోజనాలు సిద్ధం.. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి.. చిన్న తాంబూలం.. పెద్ద తాంబూలాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు.. మరో గంటలో పెళ్లి పీటలపైకి పెళ్లి కుమార్తె చేరుకోవాల్సి ఉంది.. పెళ్లి చీర కట్టుకుని వస్తానని చెప్పి వెళ్లిన పెళ్లి కుమార్తె తిరిగి రాలేదు.. పెళ్లి మండపం నుంచి పెళ్లి కుమార్తె.. తన లవర్ తో వెళ్లిపోయింది.. అంతే అందరూ షాక్.. కల్యాణ మండపంలో గంభీరం వాతావరణం.. ఈ ఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో.. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి, కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన బజారి కుమారుడు విశ్వాసికి పెద్దలు పెళ్లి నిర్ణయించారు. 2024, అక్టోబర్ 25వ తేదీ తెల్లవారుజామున ముహూర్తం ఫిక్స్ చేశారు పండితులు. పెళ్లి కుమార్తెకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. దీంతో పెళ్లికి నాలుగు గంటల ముందు.. కల్యాణ మండపం నుంచి పెళ్లి కుమార్తె.. తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.
దీంతో పెళ్లి కుమార్తె తండ్రితోపాటు బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు. పెళ్లి మండపం నుంచి పెళ్లి కుమార్తె వెళ్లిపోతున్న విజువల్స్, ఫొటోలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. వాళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు, బంధువులు. జరగాల్సిన పెళ్లి ఆగిపోవటంతో.. పెళ్లి కుమారుడి పేరంట్స్, బంధువులు గొడవకు దిగారు. పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారు.