వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇంట్లో ఒప్పుకొరని తెలుసు.. కానీ ఒకరిని విడిచి మరోకరు ఉండలేరు..దీంతో గుడిలోకి వెళ్లి సిక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తరుపు బంధువులు అబ్బాయిపై దాడికి దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గన్నేరువరం గ్రామానికి చెందిన ఇక్కుర్తి కిరణ్(28), రాపోలు రమ్య(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోరని భావించి మార్చి30వ తేదీన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకొన్నారు. అనంతరం ఆత్మరక్షణ కోసం గన్నేరువరం పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల సాయం కోరారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పోలీస్ స్టేషన్ కు వచ్చి కిరణ్ పై దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు.