టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభితా ధూళిపాళ్లల(Sobhita Dhulipala) పెళ్లి డిసెంబర్ 4న జరగనున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్ళికి ఇంకా రెండ్రోజులు మాత్రమే టైం ఉండటంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే వధువు శోభితను సోమవారం (డిసెంబర్ 2న) పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. మంగళ హారతులు ఇచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శోభిత తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఆమె సంప్రదాయ చీర కట్టులో మెరిసిపోతూ నవ్వుతూ సినీ ప్రియులను ఆకర్షిస్తోంది. కాగా ఇటీవలే హల్దీ వేడుక ఫొటోల్ని శోభితా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి.
ALSO READ : Bigg Boss: బిగ్ బాస్ తెలుగు షో టైమింగ్స్‌లో మార్పు.. Dec2న ఎప్పుడు ప్రసారం అంటే?.. కారణమిదే!
సాంప్రదాయాల పరంగా ఈ పెళ్లి ఘనంగా జరగబోతున్నా.. అతిథులు మాత్రం చాలా తక్కువే రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న రాత్రి 8.13 గంటలకు బ్రాహ్మణ సంప్రదాయంలో పెళ్లి జగనున్నట్లు సమాచారం.
ఈ అక్కినేని వారి వేడుకకు తెలుగు ఇండస్ట్రీ నుంచి మెగా ఫ్యామిలీతో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ సందడి చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు, ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు సమాచారం.