ఇక పెళ్లిళ్లు అయినట్లే : సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి రద్దు చేసుకున్న అమ్మాయి

ఇక పెళ్లిళ్లు అయినట్లే : సిబిల్ స్కోర్ తక్కువ ఉందని.. పెళ్లి రద్దు చేసుకున్న అమ్మాయి

పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలనేది పాత సామెత.. మారుతున్న కాలంతో అమ్మాయికి అబ్బాయి.. అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు అనే వరకు మొన్నటి వరకు ఇచ్చింది. నిన్నటి వరకు మాత్రం అమ్మాయి అయితే చాలు.. అబ్బాయి అయితే చాలు అనే వరకు వచ్చింది.. ఇప్పుడు కొత్తగా సిబిల్ స్కోర్ ఎంటర్ అయింది. అవును మరి.. అబ్బాయి సిబిల్ స్కోర్ (మన లావాదేవీలకు సంబంధించి ఇచ్చే రేటింగ్) (Cibil Score) వరకు వచ్చింది. అబ్బాయి సిబిల్ స్కోర్ సరిగా లేదని.. స్కోర్ చాలా తక్కువగా ఉందనే కారణంతో ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నది అమ్మాయి కుటుంబం. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

మహారాష్ట్ర రాష్ట్రం ముర్తిజాపూర్ ప్రాంతానికి చెందిన కుర్రోడు. ఐటీ ఉద్యోగి. ఉద్యోగానికి తగ్గట్టు.. జీతానికి తగ్గట్టు నాలుగు, ఐదు లోన్లు తీసుకున్నాడు. దర్జాగా బండి, ఇల్లు కొన్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని సంబంధాలు చూశారు ఇంట్లో పెద్దలు. ఓ సంబంధం వచ్చింది. రెండు కుటుంబాలకు నచ్చింది. జాతకాలు కూడా కలిశాయి. కట్నకానుకలు, పెట్టుబడులు, కళ్యాణ మండపాలు అన్నీ మాట్లాడుతున్నారు. మంచి ముహూర్తంలో పెళ్లికి రెడీ అయ్యాయి రెండు కుటుంబాలు.

ALSO READ | By Polls: యూపీ లోనూ బీజేపీ ఆధిక్యం.. తమిళనాడులో డీఎంకే లీడ్

పెళ్లి సంబంధం అంతా ఒకే అనుకున్న సమయంలో.. అమ్మాయి నాన్నకు ఓ డౌట్ వచ్చింది. అబ్బాయి బ్యాంక్ అకౌంట్, పాన్ నెంబర్ తీసుకుని సిబిల్ స్కోర్ చెక్ చేశాడు. అబ్బాయి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని రిపోర్ట్ వచ్చింది. షాక్ అయ్యాడు. ఆర్థిక లావాదేవీలు సరిగా లేవని.. అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. ఇలాంటి అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చేది లేదని డిసైడ్ అయ్యాడు. పెళ్లి రద్దు చేసుకున్నాడు.

అబ్బాయి మాత్రం లబోదిబో అంటున్నారు. EMIలు ఉన్నాయని.. బండి, ఇంటికి ఈఎంఐ కడుతున్నానని.. దుబారా కోసం అప్పులు చేయలేదని.. దీని వల్లే సిబిల్ స్కోర్ తక్కువగా వచ్చిందంటూ నెత్తీనోరూ బాదుకున్నాడు. అయినా సరే.. అమ్మాయి తండ్రి మాత్రం పెళ్లి రద్దు చేసుకున్నాడు. క్రెడిట్ కార్డు బిల్లులు కూడా నువ్వు సరిగా చెల్లించటం లేదు.. అలాంటి నీకు పెళ్లి ఎందుకు అంటూ వెళ్లిపోయింది ఆ సంబంధం. 

దేశంలోనే మొదటి సారి ఇలా సిబిల్ స్కోర్ కారణంగా పెళ్లి రద్దు కావటం. ఇది చర్చనీయాంశం అయ్యింది. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటీ అంటే.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందించే స్కో. ఇది సాధారణంగా 300 నుంచి 900 పాయింట్ల వరకు ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అంత ఎక్కువగా.. త్వరగా అప్పులు ఇస్తాయి. తీసుకున్న అప్పులకు మనం చెల్లించే విధానాన్ని బట్టి ఈ స్కోర్ ఉంటుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అప్పులు త్వరగా ఇవ్వకపోగా.. ఇచ్చేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. 

మొత్తానికి భారతదేశంలో ఫస్ట్ టైం.. సిబిల్ స్కోర్ ఆధారంగా పెళ్లి రద్దు కావటం. ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా ఓ అర్హతగా లిస్టులో చేరిపోయింది కాబట్టి.. ఇక మగాళ్లకు పెళ్లిళ్లు అయినట్లే..