- కూలిన సైడ్ పిల్లర్లు
రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు సమీపంలో వాగుపై నిర్మించిన బ్రిడ్జి (వంతెన ) ప్రమాదకరంగా మారింది. శనివారం కురిసిన భారీ వర్షానికి సైడ్ పిల్లర్లు కూలిపోయాయి. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ఇరుపక్కల సైడ్ వాల్స్ (పిల్లర్లు )కూలి నీటిలో పడ్డాయి. దీంతో ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. సైడ్ వాల్సే కాకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తోంది.
దీంతో బ్రిడ్జి ఎప్పుడు కూలుతుందోనని ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. జహీరాబాద్, బీదర్,నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఈ బ్రిడ్జి నుంచే వాహనాలు వెళ్తుంటాయి. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని రాయికోడ్ మండల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.