రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా రోడ్డు కొట్టుకుపోయి.. రాకపోకలు స్తంభించిపోయాయి. పురుషోత్తమయ్య గూడెం దగ్గర మహబూబాబాద్ నుంచి మరిపెడకు వెళ్లే జాతీయ రహదారి 365 పై ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. చుట్టు పక్కలు ఉన్న గ్రామల చెరువులు, కుంటల వరద నుంచి వాగు ఉప్పొంగింది.. దీంతో వాగుపై ఉన్న బ్రిడ్జ్ ధ్వంసమైంది.
బ్రిడ్జ్ కు ఇరు వైపుల ఉన్న రోడ్డు కొంతవేర కోతకు గురైంది. ఇరువైపులా ఉన్న గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అటు కేసముద్రం మండలంలో ఆదివారం ఉదయం రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలో వరద బీభత్సానికి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. అధికారులు సహయక చర్యలు చేపడుతున్నారు. భారీ వాహనాలను పోలీసులు దారి మళ్లించి.. తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు.