ముర్రేడు వాగు బ్రిడ్జిపై అడుగుకో గుంత

కొత్తగూడెంలోని ముర్రేడు వాగుపై ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. రిపేర్లు చేయకపోవడంతో రోడ్డుపై అడుగుకో గుంత ఏర్పడింది. బ్రిడ్జి శ్లాబ్​పై ఇనుప చువ్వలు పైకి తేలాయి. బైకులు, ఆటోలు వాటి మీదుగా వెళ్లినప్పుడు టైర్లు పంక్చర్​ అవుతున్నాయి. హైదరాబాద్, ఖమ్మం నుంచి కొత్తగూడెం మీదుగా పాల్వంచ, భద్రాచలం, మణుగూరుతోపాటు ఛత్తీస్​గఢ్, ఏపీ వైపు వెళ్లే వెహికల్స్ ఈ బ్రిడ్జి మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది.

సింగరేణి బొగ్గుతోపాటు వేర్వేరు ప్రాంతాలకు గూడ్స్​ తీసుకెళ్లే హెవీ వెహికల్స్​ తిరిగే బ్రిడ్జిని అధికారులు, లీడర్లు పట్టించుకోవడం లేదు. డ్యామేజ్ ​అయినచోట నామమాత్రంగా తారుపోసి చేతులు దులుపుకుంటున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, వివిధ శాఖలు అధికారులు ఇటుగా తిరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

వెలుగు, భద్రాద్రికొత్తగూడెం