మైలారం మైసమ్మ గుట్ట ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలి :  జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మైలారం మైసమ్మ గుట్ట ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలి :  జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గన్నేరువరం, వెలుగు: మానేరు నదిపై చొక్కరావుపల్లె –ఖాజీపూర్ మధ్య బ్రిడ్జి నిర్మాణ ప్రణాళికను రద్దు చేయాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు నిరసన తెలిపారు. మంగళవారం మైలారం మైసమ్మ గుట్ట ప్రాంతంలో నిర్వహించిన ఈ నిరసనలో బ్రిడ్జి సాధన జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ చొక్కారావుపల్లె, ఖాజీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య బ్రిడ్జి నిర్మాణ ప్రణాళికను రద్దు చేసి మైలారం మైసమ్మ గుట్ట ప్రాంతం నుంచి నిర్మించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

దీనివల్ల గన్నేరువరం మండలం నుంచి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 9 కి.మీ మాత్రమే ఉండడంతోపాటు ఇల్లంతకుంట, గన్నేరువరం, బెజ్జంకి మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుత ప్లాన్ ప్రకారం నిర్మిస్తే కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. బ్రిడ్జి సాధన జేఏసీ సభ్యులు రాజమల్లు, చింటూ, పవన్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేశం , పరుశరాములు పాల్గొన్నారు.