- ఆందోళన చెందుతున్న ప్రయాణికులు
- పర్యవేక్షణ చేయని ఆఫీసర్లు
సిరికొండ, వెలుగు : సిరికొండ మండలంలోని గడ్కోల్ వాగు వద్ద రూ.12 కోట్లతో , ధర్పల్లి మండలంలోని వాడి వాగు వద్ద రూ.9.50 కోట్లతో రెండు నెలల కిందట నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు వేగవంతం చేయకపోవడంతో ఈ వానాకాలం నాటికి బ్రిడ్జి పూర్తి కావడం కష్టంగానే కనిపిస్తుంది. దీంతో రెండు మండలాల ప్రయాణికులకు రాకపోకలకు అంతరాయం కలిగి జిల్లాలకు సంబంధం తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడతామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో రైతులు తమ పంట పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ నాణ్యత పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లాస్థాయి ఆఫీసర్లు పరిశీలన చేసి పనుల్లో నాణ్యత పాటించి వేగవంతం చేయాలని
కోరుతున్నారు.