ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేస్తుండగా బ్రిడ్జేట్ ప్యాటర్సన్ కు గాయమైంది. మంగళవారం(అక్టోబర్ 29) నార్త్ సిడ్నీ ఓవల్‌లో సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో సీమర్ డార్సీ బ్రౌన్ క్రాస్-సీమ్ డెలివరీని సిక్సర్స్ కెప్టెన్ ఎల్లీస్ పెర్రీకి విసిరింది. బంతి బౌన్స్ అయిన తర్వాత ప్యాటర్సన్ అంచనా వేయడంలో విఫలమైంది. బంతిని బ్యాటర్ మిస్ చేయడంతో అది నేరుగా వికెట్ కీపర్ కుడి కన్ను పక్క భాగంలో తగిలింది.
బంతి బలంగా తగలడంతో ఆమె అక్కడే పడిపోయింది. ఆమె పరిస్థితి చూసి వైద్యులు వెంటనే గ్రౌండ్ లోకి వచ్చారు. బంతి తగిలిన రక్తం కనిపించడంతో ఆమె మైదానం వీడింది. ఆమె స్థానంలో రిజర్వ్ వికెట్ కీపర్ ఎల్లీ జాన్‌స్టన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టింది. గాయం పెద్దది కాకపోవడంతో వెంటనే ప్యాటర్సన్ ఆమె స్థానంలో వికెట్ కీపింగ్ చేసింది. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో ఆమె తొమ్మిది క్యాచ్ లు పట్టడంతో పాటు 12 స్టంపింగ్‌లు చేసింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే 11 పరుగుల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్.. సిడ్నీ సిక్సర్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్ట్రైకర్స్.. 171 పరుగులకు ఆలౌటైంది. 44 పరుగులు చేసి ప్యాటర్సన్ టాప్ స్కోరర్ గా నిలిచింది. సిక్సర్ల స్పిన్నర్ యాష్ గార్డనర్ నాలుగు వికెట్లు తీసుకుంది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సిక్సర్ 160 పరుగులకే పరిమితమైంది.
Thoughts are with Bridget Patterson after copping this nasty blow 🙏 #WBBL10 pic.twitter.com/4Yc1hWSmUD
— Weber Women's Big Bash League (@WBBL) October 29, 2024