మున్సిపాలిటీగా రామకృష్ణాపూర్
రామకృష్ణాపూర్,వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్చుతూ మంగళవారం మంత్రి కేటీఆర్ప్రకటించారు. దీంతో స్థానికులు, టీఆర్ఎస్లీడర్లు సంబురాలు చేసుకున్నారు. మంగళవారం స్థానిక సూపర్‌బజార్ చౌరస్తాలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చారు. సీఎం కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ఎండీ అబ్దుల్ అజీజ్, సీనియర్ లీడర్లు గాండ్ల సమ్మయ్య, యాకుబ్‌అలీ, మాజీ సర్పంచ్ జాడి శ్రీనివాస్, గోపు రాజం, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ ప్రెసిడెంట్సాగర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పౌర హక్కులపై అవగాహన పెంచుకోవాలి
మంచిర్యాల,వెలుగు: పౌర హక్కులపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో అడిషనల్కలెక్టర్మధుసూదన్ నాయక్, డీసీపీ అఖిల్ మహాజన్, ట్రెయినీ కలెక్టర్పి.గౌతమితో కలిసి రివ్యూ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. చట్టం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు
362 కేసుల్లో బాధితులకు పరిహారం అందిందన్నారు. మరో 32 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గ్రామాల్లో నిర్వహించే సివిల్రైట్స్డేలకు పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, అటవీ, ఆరోగ్య శాఖ అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. ఆయా మండలాల తహసీల్దార్ల సమన్వయంతో గ్రామసభల వివరాలు అందరికీ తెలపాలన్నారు. తప్పుడు కేసులు నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, ఏసీపీ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
దిందా గ్రామస్తుల మరోసారి నిరసన
కాగజ్ నగర్, వెలుగు: వానాకాలం వస్తేచాలు ఊరు దాటలేని పరిస్థితి ఉంది. బ్రిడ్జి కడితేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లని దిందా గ్రామస్తులు పేర్కొన్నారు. ఏడాది క్రితం ఇదే విషయమై గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. ఉన్నతాధికారులు మూడు నెలల్లో బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. అయినా బ్రిడ్జి కాకపోవడంతో గ్రామస్తులు మంగళవారం మరోసారి ఆందోళన బాటపట్టారు. బ్రిడ్జి నిర్మాణ స్థలం వద్ద గుడిసె వేసి నిరస దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఊరికి ఓ వైపు వాగు.. మరో వైపు ప్రాణహిత నది ప్రవహిస్తోందన్నారు. చిన్న వర్షం పడితే చాలు వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోతాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, బ్రిడ్జి మంజూరైనా అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదన్నారు. స్పష్టమైన హామీ ఇస్తే తప్ప దీక్ష విరమించమని స్పష్టం చేశారు. అంతకుముందు గ్రామస్తులు స్థానిక పోశమ్మ ఆలయంలో కొబ్బరి కాయ కొట్టి ప్లకార్డులతో వాగు వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.
పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి
ఆదిలాబాద్,వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం కార్యకర్తలు కృషిచేయాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. ఇటీవల హైదరాబాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ లో చేరిన ఆదిలాబాద్ కు చెందిన ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మొదటి సారిగా జిల్లాకు వచ్చారు. కార్యర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, గుస్సాడి నృత్యాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ సోయం బాపూరావుతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, కంది శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు కేవలం మూడు రోజుల్లో ముగించడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తారంటూ మునుగోడులో దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్అయ్యారు. అనంతరం పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకుందని అందుకే కేంద్రంపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నారై కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జోగు రామన్న ఏంసమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు రావాలంటే 120 ఏళ్లు కావాలన్నారు. దళిత బంధు పేరుతో సర్కార్ మోసం చేస్తోందన్నారు. బీసీ, ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఎంత మందికి లబ్ది చేకూరిందో చెప్పాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు గొర్ల రాజుయాదవ్, ఆడె మానాజీ, గడ్డం నంది రెడ్డి, ధోని జ్యోతి, హరినాయక్ , రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చలో అసెంబ్లీకి వెళ్తున్న కాంట్రాక్ట్ కార్మికుల అరెస్టు
మందమర్రి/నస్పూర్/బెల్లంపల్లి,వెలుగు: సింగరేణి లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లు, చట్టబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన పిలుపులో భాగంగా చలో అసెంబ్లీ ఆందోళనకు వెళ్తున్న కాంట్రాక్ట్ కార్మిక సంఘాల లీడర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మంగళవారం బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని పలువురు లీడర్లను అరెస్టు చేశారు. అయినా చాలామంది కార్మికులు బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల రైల్వే స్టేషన్ల మీదుగా పెద్ద సంఖ్యలో ఛలో అసెంబ్లీ కోసం హైదరాబాద్ తరలివెళ్లారు.
కోయగూడెం ఓసీపీని సింగరేణికే కేటాయించాలి
మందమర్రి,వెలుగు: కోయగూడెం ఓసీపీని సింగరేణికి కేటాయించాలని ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సింగరేణి గనుల ప్రైవేటీకరణకు నిలిపివేయాలని, సంస్థ లాభాల్లో కార్మికులకు 35శాతం వాటా ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని కోరుతూ గనులు, జీఎం ఆఫీస్ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓసీపీని ఆరబిందో కంపెనీకి కేటాయించడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 30 శాతం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట నిలుపుకోవాలన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, లీడర్లను అరెస్టు చేయడం సరికాదన్నారు. నిరసనలో బ్రాంచి సెక్రటరీలు సలెంద్ర సత్యనారాయణ, ఎండీ అక్బర్అలీ, దాగం మల్లేశ్, వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, చిప్ప నర్సయ్య, పిట్ సెక్రటరీలు సురమల్ల వినయ్ కుమార్, సంజీవ్, ఆంజనేయులు, వెల్ది సుదర్శన్, కొత్త తిరుపతి, కంది శ్రీనివాస్, మర్రి కుమారస్వామి, మీనుగు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.