ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా/కుభీర్/నర్సాపూర్(జి)​,వెలుగు:  ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ నిర్వహిస్తున్న పాదయాత్రలో జనం సమస్యలు ఏకరవు పెడుతున్నారు. సమస్యలను ఓపికగా వింటున్న సంజయ్​త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రానుందని.. సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్​లీడర్లు దోచుకున్న సొమ్మును వెనక్కి రప్పిస్తామని, కేసీఆర్​కుటుంబాన్ని జైలుకు పంపుతామని తెలిపారు. శుక్రవారం యాత్ర కుంటాల మండలం అంబకంటి నుంచి ప్రారంభమై బామ్ని, నందన్, నర్సాపూర్ మీదుగా రాంపూర్​ వరకు కొనసాగింది. భారత్ మాతాకీ జై, జై శ్రీరాం అనే నినాదాలు మారుమోగాయి. యువకులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. నందన్​లో బండి సంజయ్ ముధోల్ సెగ్మెంట్​లీడర్లు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్​రెడ్డి, యాత్ర సహా ప్రముఖ్​వీరేందర్​గౌడ్, పార్టీ సీనియర్ లీడర్లు​ రాణిరుద్రమ, హేమారెడ్డి, ఎంపీ సోయం బాపూరావు, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, లీడర్లు రామారావుపటేల్, మోహన్ రావు పటేల్, సుహాసిని రెడ్డి, భూమయ్య, సంగప్ప, మల్లికార్జున్​రెడ్డి, అప్పాల గణేశ్, గంగాధర్, బాజీరావు ఉన్నారు.
సంగ్రామ యాత్రలో నడ్డా బర్త్ డే వేడుకలుప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బర్త్ డే వేడుకలు నిర్వహించారు. స్వీట్లు పంచి మహిళలకు బండి సంజయ్ చీరలు అందజేశారు. 

బాల్కసుమన్​ నోరు అదుపులో పెట్టుకోవాలి

నస్పూర్, వెలుగు: వైఎస్సార్​టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గం నగేశ్ కోరారు. శుక్రవారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. సీఎం రాజశేఖరరరెడ్డి పాలనలో పేదలకు న్యాయం జరిగిందన్నారు. ఎ న్నికల టైమ్​లో కేసీఆర్​మందమర్రి మీటింగ్ లో  చెన్నూర్ నియోజకవర్గాన్ని సిద్దిపేట, సిరిసిల్ల తరహా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి మాటతప్పారన్నారు. సమావేశంలో పార్టీ బెల్లంపల్లి కో ఆర్డినేటర్ చిలుక సంతోష్,  మైనార్టీ సెల్​జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హాది, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, జితేందర్, సమీర్ పాల్గొన్నారు.

అంబేద్కర్​ ఆశయాలకనుగుణంగా పాలన

నిర్మల్,వెలుగు: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. శుక్రవారం సారంగాపూర్ మండలం చించోలి క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ నమూనా ఫొటోను మంత్రి తన క్యాంప్ ఆఫీసులో ఆవిష్కరించారు. చించోలి వద్ద ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహం లాంటిది మహారాష్ట్రలోని బీమా గోరేగాం, ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయన్నారు. విగ్రహానికి సంబంధించిన ఫౌండేషన్ రైలింగ్ పనులు తొందరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే నిర్మల్ లో ఐదు కోట్ల రూపాయలతో అంబేద్కర్ భవనం నిర్మించామన్నారు. ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద గతంలో అతిపెద్ద కంచు విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సత్యనారాయణ, ఎంపీపీ మహిపాల్ రెడ్డి, కృష్ణంరాజు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, దళిత నాయకుడు లక్ష్మణ్, సర్పంచ్ లక్ష్మీరమేశ్, ఎంపీటీసీ వెంకట రమణారెడ్డి, సారంగాపూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నాగయ్య, బుద్ధ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, దళిత చైతన్య సదస్సు కో కన్వీనర్ రాజన్న, టీఆర్ఎస్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రఘు, నిర్మల్ బుద్ధ మహాసభ అధ్యక్షుడు వెంకటస్వామి, ప్రసాద్, ముత్తన్న, దవడ సుభాష్ పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలపై ఆఫీసర్ల కొరడా

కుభీరు/లోకేశ్వరం/బెల్లంపల్లి రూరల్,వెలుగు: ఉమ్మడి జిల్లాలోని అక్రమ వెంచర్లపై ఆఫీసర్లు కొరడా ఝలిపిస్తున్నారు. శుక్రవారం నిర్మల్​జిల్లా కుభీర్ తహసీల్దార్​విశ్వంభర్ వెంచర్ల హద్దు రాళ్లను తొలగించాలని పంచాయతీ సెక్రటరీ పాండు సింగ్‌ను ఆదేశించారు. పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మించిన ఇండ్ల విషయమై కలెక్టర్​దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆయన వెంట ఆర్ఐ వెంకటరమణ, సర్పంచ్ కవిత రాజు తదితరులు ఉన్నారు. లోకేశ్వరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్ల హద్దులు తొలగించినట్లు తహసీల్దార్​ సరిత తెలిపారు. ఆమె వెంట ఎంపీవో సల్మాన్​రాజ్, డిప్యూటీ తహసీల్దార్ అశోక్ తదితరులు ఉన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్​ మండలంలోని బోయపల్లి బోర్డు వద్ద అసైన్డ్​ భూముల్లోని అక్రమ నిర్మాణాలను జిల్లా పంచాయతీ అధికారి నారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దన్నారు. కొందరు రూల్స్​కు విరుద్ధంగా ప్లాట్లు చేసి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుమతులు లేని వెంచర్లపై చర్యలు