ఆదిలాబాద్/మంచిర్యాల/ఆసిఫాబాద్/కాగజ్‌నగర్,వెలుగు: జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. శుక్రవారం ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలో 15 వేల మంది చొప్పున భారీ ర్యాలీ నిర్వహించేందుకు రూట్ మ్యాప్ తయారు చేయాలని సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న ఆదివాసీ భవన్, బంజార భవన్ కు సంబంధించి పోస్టర్లను రిలీజ్ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు రిజ్వాన్ బాషా, ఎన్. నటరాజ్, ట్రెయినీ కలెక్టర్ శ్రీజ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, జడ్పీ సీఈవో గణపతి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ డీపీఆర్వో భీంకుమార్ ఉన్నారు.
మంచిర్యాలలో..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లాలో నిర్వహించనున్న ర్యాలీని విజయవంతం చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి కోరారు. పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి, డీసీపీ అఖిల్ మహాజన్, అధికారులతో కలిసి గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐలు నారాయణ, కరీముల్లాఖాన్, సంజీవ్, శ్రీనివాస్, నరేశ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌లో..
సమైక్యత వజ్రోత్సవాలతో జిల్లాలో పండగ వాతావరణం కనిపించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. గురువారం కలెక్టర్ చాంబర్ లో అడిషనల్ కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పేయ్, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మితో కలిసి వేడుకల సంబంధిత పోస్టర్లు రిలీజ్చేశారు. జిల్లా కేంద్రంలో సుమారు 15 వేల మందితో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ సురేశ్‌కుమార్ తెలిపారు. కాగజ్ నగర్ లో అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, డీఎస్పీ కరుణాకర్‌తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
నస్పూర్, వెలుగు: మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. గురువారం సీసీసీ సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో షీ టీంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ తో కలిసి హాజరయ్యారు. ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీపీ కోరారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని తెలిపారు. మహిళలు, విద్యార్థినులు, బాలికల భద్రత కోసం షీటీంలు పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో ఏసీపీ తిరుపతిరెడ్డి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ నిర్వహణ బాగాలేదు
కాగజ్ నగర్,వెలుగు: కాగజ్నగర్కస్తూరిబా గాంధీ విద్యాలయం, హాస్టల్లో వసతులు బాగాలేవని సిర్పూర్(టి) మున్సిఫ్‌కోర్టు జడ్జి పి.రవి అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్‌రూమ్స్, ట్రంక్‌పెట్టెలు, పరిసరాలు, టాయిలెట్లు, భోజనం, తాగునీరు తదితరాలు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరాతీశారు. గతనెల 7న విద్యార్థి ఐశ్వర్య మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. వసతి గృహం నిర్వహణ తీరు బాగాలేదన్నారు. ఇన్చార్జి స్పెషల్ఆఫీసర్ పర్స జ్యోతి విధుల్లో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన వెంట అడ్వకేట్ కిశోర్‌బాబు, ఎస్సై సాగర్ తదితరులు ఉన్నారు.
బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
రామకృష్ణాపూర్,వెలుగు: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని బీజేపీ జిల్లా ఇన్చార్జి పల్లె గంగారెడ్డి కోరారు. గురువారం గద్దెరాడి భీమా గార్డెన్లో నిర్వహించిన జిల్లా శక్తి కేంద్రాల ఇన్చార్జీలు, పార్టీ మండల అధ్యక్షులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు
త్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషిచేస్తోందన్నారు. ఈనెల 25లోపు అన్ని బూత్ కమిటీల నియామకాన్ని పూర్తిచేయాలన్నారు.ఈనెల 17న ప్రధాని నరేంద్రమోదీ బర్త్‌డేను పురస్కరించుకొని మంచిర్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించే మెగా రక్తదానశిబిరాన్ని సక్సెస్ చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మాల్లారెడ్డి, పానుగంటి రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల హేమాజీ, పార్లమెంట్ కో కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, లీడర్లు ఆరుముల్ల పోశం, ఎర్రబెల్లి రవీందర్రావు, పెద్దపల్లి పురుషోత్తం, రజనీశ్‌జైన్, పార్టీ మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్లు వెంకటేశ్వర్రావు, మహంకాళి శ్రీనివాస్, సప్పిడి నరేశ్, కోడి రమేశ్, పైడిమల్ల నర్సింగ్ తదితరులు
పాల్గొన్నారు.
ఈఎం ట్రేడ్మెన్లకు ప్రమోషన్ ఇవ్వాలి
మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియాలోని ఈఅండ్ ఎం ట్రేడ్మెన్లకు 'డి'గ్రేడ్ ప్రమోషన్లు ఇవ్వాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం ఐఎన్టీయూసీ ప్రతినిధుల బృందం సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ దృష్టికి ప్రమోషన్ల అంశం తీసుకవెళ్లారు. ఈ సందర్భంగా జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ మందమర్రి ఏరియా పరిధిలో ఐదేండ్లలో 60 మస్టర్లు ఆబ్సెంట్ఉన్న ట్రేడ్మెన్లకు ప్రమోషన్నిలుపుదల నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలన్నారు. డ్యూటీలకు గైర్హాజరు కాకుండా ఈఎం ఎంప్లాయీస్‌కు యాజమాన్యం అవగాహన కల్పించి బొగ్గు ఉత్పత్తిలో భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు ఆయన సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఎస్. నర్సింహారెడ్డి, సిద్దంశెట్టి రాజమౌళి, పి.ధర్మపురి, జనరల్ సెక్రటరీలు కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, పసునూటి రాజేందర్, అల్బర్ట్ పాల్గొన్నారు.