మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతీపురం కొత్త కాలనీలో కనీస వసతులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి చెప్పారు. కాలనీలో తాగునీరు, రోడ్లు, కరెంట్, డ్రైనేజీ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆఫీసర్లు, పంచాయతీ పాలకవర్గానికి ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో గ్రామం నుంచి ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ నిరసన తెలిపారు. ఆర్డీవో ఆఫీస్ వద్ద జూలకంటి మాట్లాడారు.
మిషన్ భగీరథ ప్లాంట్ ఏర్పాటు చేసిన అవంతీపురంలోనే మంచినీళ్లు అందకపోవడం సరికాదన్నారు. కాలనీలో కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి పక్కా ఇండ్లు కట్టించడంతో పాటు, నీటి సదుపాయం కల్పించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వెల్లడించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, జిల్లా కమిటీ సభ్యుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవి నాయక్, పాదూరి శశిధర్ రెడ్డి, ఆయూబ్, సైదులు, జ్యోతి, గోవిందరెడ్డి పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరి బ్రాహ్మణవాడ ప్రైమరీ స్కూల్‌లో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించన కంటి, దంత వైద్య శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. సుమారు 100 మంది స్టూడెంట్లకు టెస్టులు చేసి అద్దాలు, మందులు పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షురాలు బండారు జయశ్రీ, డాక్టర్లు అరుణ, అశ్లేష, హెచ్‌ఎం చందూలాల్, స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి జ్యోతి ఉన్నారు.
సుద్దాలను మండలం చేయాలి
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా సుద్దాల గ్రామాన్ని మండలం చేయాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కోరారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తులతో కలిసి యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుద్దాలకు పక్కనే ఉన్న 12 గ్రామాలను కలుపుతూ మండలం చేయాలని కోరారు. అనంతరం నిర్వహించిన ప్రజావాణికి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ప్రజల నుంచి మొత్తం 38 ఫిర్యాదులు అందగా ఇందులో 28 రెవెన్యూ శాఖ, 3 పంచాయతీ రాజ్, 3 గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినవేనన్నారు. వీటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, భూపాల్‌రెడ్డి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నాగేశ్వరాచారి ఉన్నారు.
గ్రీవెన్స్ అప్లికేషన్లు పెండింగ్‌లో పెట్టొద్దు
నల్గొండ అర్బన్, వెలుగు : గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని నల్గొండ కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆఫీసర్లు ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి మొత్తం 42 అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. అప్లికేషన్లను పెండింగ్‌లో పెట్టకుండా వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. ఒకవేళ రిజక్ట్ చేస్తే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారుడికి అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్, బీసీడీవో పుష్పలత, ఎస్సీడీవో సల్మా భాను, మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసర్ బాలకృష్ణ పాల్గొన్నారు.
రోడ్డు నిర్మించాలని ధర్నా
నల్గొండ అర్బన్, వెలుగు : నేషనల్ హైవే 65 నుంచి పిట్టంపల్లి మీదుగా నల్గొండ – అద్దంకి బైపాస్ వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని సీపీఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పిట్టంపల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రోడ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తూ గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు తుమ్మల వీరారెడ్డి, ఎండీ.సలీం, సయ్యద్ హశం, కొండ లింగస్వామి, పుచ్చకాయల నర్సిరెడ్డి, అద్దంకి నరసింహ, దండంపెల్లి సత్తయ్య, నర్సిరెడ్డి పాల్గొన్నారు.
గ్రీవెన్స్ అప్లికేషన్లు పెండింగ్‌లో పెట్టొద్దు
నల్గొండ అర్బన్, వెలుగు : గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని నల్గొండ కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆఫీసర్లు ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి మొత్తం 42 అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. అప్లికేషన్లను పెండింగ్‌లో పెట్టకుండా వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. ఒకవేళ రిజక్ట్ చేస్తే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారుడికి అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్, బీసీడీవో పుష్పలత, ఎస్సీడీవో సల్మా భాను, మైనార్టీ సంక్షేమ శాఖ ఆఫీసర్ బాలకృష్ణ పాల్గొన్నారు.
చదువుతో పాటు ఆటలకు ప్రయారిటీ
నకిరేకల్, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు ఆటలకు ప్రయారిటీ ఇవ్వాలని నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. సంక్రాంతి సందర్భంగా చిరుమర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండలాల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతకుముందు క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేసి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో డీఈవో భిక్షపతి, చిరుమర్తి చేయూత ఫౌండేషన్ చైర్మన్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు