దేవరకొండ, వెలుగు : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే చాలా మంది ఆ పార్టీలో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన దేశ్‌ముకోనికుంటకు చెందిన పలువురు సోమవారం పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ అండగా ఉంటామన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో 80 గ్రామపంచాయతీలకు కొత్త బిల్డింగ్‌లు మంజూరు అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, శిరందాసు కృష్ణయ్య, రమావత్ దసృనాయక్, పసునూరి యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం మొరిపిరాలకు చెందిన పలువురు సోమవారం యాదగిరిగుట్టలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలం కావడం వల్లే బీఆర్‌ఎస్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్, మండల సెక్రటరీ జనరల్ శ్రీనివాస్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
నల్గొండ అర్బన్, వెలుగు : గ్రామీణ, పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించాలని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సూచించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన విజయదుర్గ హాస్పిటల్‌ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగరాలకు ధీటుగా ఇక్కడ కూడా అన్ని రకాల, అధునాతన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, హాస్పిటల్ ఎండీ.అభినయ్‌రెడ్డి, కౌన్సిలర్లు బండారు ప్రసాద్, ప్రదీప్ నాయక్ పాల్గొన్నారు.
కోదండ రామస్వామి ఆలయానికి శంకుస్థాపననల్గొండ మండలం పజ్జూరులో నిర్మిస్తున్న కోదండ రామస్వామి ఆలయానికి సోమవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ మోయిజ్, మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సంపత్‌రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్, కందుల లక్ష్మయ్య పాల్గొన్నారు.
కోదాడను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చెప్పారు. పట్టణంలోని పలు వార్డుల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులకు సోమవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోదాడ మున్సిపాలిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పట్టణాల రూపురేఖలే మారిపోయాయన్నారు. అన్ని వార్డుల్లో దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంపటి పద్మ, కౌన్సిలర్లు కల్లూరి పద్మజ, కట్టెబోయిన జ్యోతి, కోట మధుసూదన్, మామిడి రామారావు,షేక్ మదార్, షఫీ, కందుల కోటేశ్వరరావు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
మునగాల (నడిగూడెం), వెలుగు : ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాలలో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి, టీఆర్‌ఎస్ నాయకులు దేవబత్తుని సురేశ్, వెంపటి మధుసూదన్, ఎలక నరేందర్ రెడ్డి, శీలం సైదులు, సర్పంచ్ యాతాకుల వీరస్వామి పాల్గొన్నారు.
టీ హబ్‌పై స్టూడెంట్లకు ప్రజంటేషన్
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన టీహబ్ గురించి ఆలేరు, యాదగిరిగుట్ట కాలేజీ స్టూడెంట్లకు సోమవారం హైదరాబాద్‌లో ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బస్సుల్లో స్టూడెంట్లను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీహబ్ డైరెక్టర్ శ్రీనివాస్ స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. అనంతరం విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలో టీహబ్ ఏర్పాటు చేయడం కోసం అవకాశాలను పరిశీలించాలని సీఈవో మహంకాళి శ్రీనివాసరావును కోరారు. దీనిపై టీహబ్ సీఈవో సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.