ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

హాలియా, వెలుగు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బంకాపురంలో గోపాలమిత్ర, గ్రామపంచాయతీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌, వైకుంఠధామంతో పాటు పలు అభివృద్ధి పనులను శుక్రవారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ట్రైకార్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఇస్లావత్‌‌‌‌‌‌‌‌ రామచంద్రనాయక్, నల్గొండ జడ్పీ వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఇరిగి పెద్దులు, ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ నందికొండ రాజేశ్వరి, వెనిగండ్ల పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ 
కేవీ.రామారావు, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ శోభ సత్యనారాయణ పాల్గొన్నారు.

పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

తుంగతుర్తి, వెలుగు : పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని 5, 7 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు. అనంతరం పలువురు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పోతరాజు రజినీ రాజశేఖర్, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ కొమ్మినేని స్రవంతి సతీశ్‌‌‌‌‌‌‌‌, మండల అధ్యక్షుడు రఘునందన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.

మునుగోడుకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

చండూరు (మర్రిగూడ), వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా మర్రిగూడలో శుక్రవారం జరిగిన ముఖ్య కార్యకర్తల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ను గెలిపిస్తే రోడ్ల రిపేర్లు, చండూరు రెవెన్యూ డివిజన్,  100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తానన్న హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపై ఉందన్నారు. టీడీపీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, బీసీ సెల్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర కార్యదర్శి పగడాల లింగయ్య, పుప్పాల యాదయ్య, చిన్న, బూరల మల్లేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

మహిళలు ధైర్యంగా బయటకు రావాలి

యాదాద్రి, వెలుగు : శ్రద్ధా వాకర్‌‌‌‌‌‌‌‌ ధైర్యంగా బయటకు వచ్చి ఉంటే దారుణ హత్యకు గురికాక పోయేది అని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి అన్నారు. అంతర్జాతీయ స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన చర్చా వేదికలో ఆమె మాట్లాడారు. ఎంతో చదువుకున్న శ్రద్ధావాకర్‌‌‌‌‌‌‌‌ కూడా ధైర్యంగా వ్యవహరించలేకపోవడం ప్రస్తుత పరిస్థితులకు నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు పనిచేసే చోట స్త్రీలపై వేధింపులు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. పుట్టుక నుంచే ఆడ పిల్లలపై వివక్ష కనబరుస్తున్నారన్నారు. పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ, మగ పిల్లలను సమానంగా పెంచేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు డి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి, డీఆర్డీవో ఉపేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలు కేవీ కృష్ణవేణి, అన్నపూర్ణ, అనూరాధ, సాహితి, శ్రీలక్ష్మి, జయశ్రీ పాల్గొన్నారు.

హింస లేని సమాజం కోసం కృషి చేయాలి

సూర్యాపేట, వెలుగు : హింస లేని సమాజ స్థాపనకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జ్యోతి అధ్యక్షతన శుక్రవారం సూర్యాపేటలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్త్రీలు కూడా పురుషులతో సమానంగా చదువుకుంటూ అన్ని రంగాల్లో పనిచేస్తున్నా ఇంకా వివక్ష కొనసాగడం దుర్మార్గం అన్నారు. 40 శాతం మంది మహిళలు గృహ హింస బారిన పడుతున్నారన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టే చర్యలను ప్రభుత్వాలు తమ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. హింస వ్యతిరేక దినోత్సవాన్ని స్త్రీల హక్కుల పరిరక్షణ దినంగా పాటించాలని సూచించారు. 
సదస్సులో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ ఉన్నారు.

దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

నిందితుల్లో ముగ్గురు మైనర్లు

యాదాద్రి, వెలుగు : దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులతో పాటు, మరో ముగ్గురు మైనర్లను శుక్రవారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను యాదాద్రి డీసీపీ కె.నారాయణరెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్‌‌‌‌‌‌‌‌ మండల కొత్తగూడెం గ్రామానికి చెందిన మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈ నెల 20న డీసీఎంలో నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ మండలం బొర్రాలగూడెం వద్ద డీసీఎంను పార్క్‌‌‌‌‌‌‌‌ చేసి అందులోనే పడుకున్నాడు. 21వ తేదీ ఉదయం ఆరుగురు వ్యక్తులు దాడి చేసి, కత్తితో బెదిరించి అతడి వద్ద ఉన్న రూ. 6 వేలు, సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను లాక్కొని పారిపోయారు. దీంతో మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో వాహనాల తనిఖీ చేస్తున్నారు.

ఈ టైంలో రెండు బైక్‌‌‌‌‌‌‌‌లపై అటుగా వచ్చిన ముగ్గురు యువకులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొని విచారించగా సూర్యాపేట జిల్లా అమినాబాద్, మోతె, సీతారాంపురానికి చెందిన గొల్ల గణేష్‌‌‌‌‌‌‌‌ అలియాస్‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌ రైడర్‌‌‌‌‌‌‌‌, దోసపల్లి వంశీ, దాసరి సిద్ధార్థగా గుర్తించారు. వీరు మరో ముగ్గురు మైనర్లతో కలిసి ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ దాడి దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరు గత వారం రోజుల్లో రాచకొండ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని బాలాపూర్, హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వనస్థలిపురం, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరు ముగ్గురు ఇచ్చిన సమాచారంతో ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ముగ్గురు మైనర్లను హయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 5 టూవీలర్స్‌‌‌‌‌‌‌‌, ఒక సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌, 24 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

నకిరేకల్, వెలుగు : నకిరేకల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. పట్టణంలో 100 పడకల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌, హైవే రోడ్డు విస్తరణ పనులకు శుక్రవారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులతో పాటు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ పనులను క్వాలిటీతో పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఇందులో భాగంగానే ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ గడ్డపైన గులాబీ జెండా ఎగురవేయాలని, ఇందుకోసం ప్రతికార్యకర్త కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అండగా ఉండాలన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉందన్నారు. 

అభివృద్ధిని అడ్డుకోవద్దు

హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాజకీయాలతో సంబంధం లేకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ మండలం గోపాలపురంలో శుక్రవారం పలు డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పార్టీలకతీతంగా కలిసిరావాలని, కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ నాగసైదయ్య, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కడియం వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీటీసీ రాజు పాల్గొన్నారు.

సహకార సంఘాల అభివృద్ధికి ప్రయారిటీ

గరిడేపల్లి, వెలుగు : గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో నిర్మించిన సహకార సంఘం గోడౌన్స్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధికి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కడియం వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, సర్పంచ్‌‌‌‌‌‌‌‌ కీతా జ్యోతి రామారావు, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రామయ్య పాల్గొన్నారు.

పథకాలు, సబ్సిడీలపై అవగాహన కల్పించాలి

నల్గొండ అర్బన్​, వెలుగు : ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి యూనిట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రయారిటీ ఇస్తూ, అర్హులైన లబ్ధిదారులకు లోన్లు మంజూరు చేయాలని నల్గొండ అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి, 2022– -23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ పథకాలు, సబ్సిడీలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. యూనిట్లను ఇన్‌‌‌‌‌‌‌‌టైంలో గ్రౌండింగ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన బాధ్యత బ్యాంకు ఆఫీసర్లదేనన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం.కోటేశ్వరరావు, ఎల్‌‌‌‌‌‌‌‌డీఎంటీ శ్రామిక్, నాబార్డ్‌‌‌‌‌‌‌‌ డీడీఎం వినయ్, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ లీడ్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ సాయి చరణ్ పాల్గొన్నారు.

పారదర్శకంగా ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక

కోదాడ, వెలుగు : డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా కొనసాగుతోందని కోదాడ ఆర్డీవో కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బిక్యాతండాలో నిర్మించిన 49 డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం ఆర్డీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం దశల వారీగా అర్హులైన వారందరికీ డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు నిర్మిస్తోందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌శర్మ, బిక్యాతండా సర్పంచ్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి అశోక్, ఏఎస్‌‌‌‌‌‌‌‌వో రామారావు, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ నగేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.