ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

    విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో రూ. 3 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఫ్రీ కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధిస్తోందన్నారు. కేంద్రం ఉద్యోగాల పేరిట యువతను మోసం చేసి, ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చొరవతోనే అయిటిపాముల లిఫ్ట్, మూసీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నిధులు మంజూరు అయ్యాయన్నారు. 

దేశానికే ఆదర్శంగా సూర్యాపేటలో ఆటోనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సూర్యాపేట, వెలుగు : దేశానికే ఆదర్శంగా నిలిచేలా సూర్యాపేటలో ఆటోనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తామని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. పలు యూనియన్ల ప్రతినిధులు గురువారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఆటోనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఈ నెల 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 143) మహాసభలు, వచ్చే  నెల 5 నుంచి 9 వరకు జరగనున్న పెద్దగట్టు జాతర పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించారు. పెద్ద గట్టు జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే పలు పార్టీల నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. 

బీజేపీ బలోపేతమే లక్ష్యం

యాదగిరిగుట్ట/తుంగతుర్తి/మిర్యాలగూడ, వెలుగు : బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నియోజకవర్గ పాలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సూచించారు. గురువారం యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆలేరు నియోజకవర్గ పాలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ములుగూరి భిక్షపతి, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఎర్రబెల్లి ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కవిత మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గద్దె దించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ, నియంత పాలనను అంతం చేయాలని సూచించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. 

ఈ నెల 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే వర్చువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాలీకి ప్రతిఒక్కరూ హాజరుకావాలని కోరారు. తుర్కపలిల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, ప్రభారి కళ్లెం రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి సుభాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, తుంగతుర్తిలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కాప రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, మండల అధ్యక్షుడు మహేందర్, మిర్యాలగూడలో ప్రభారి జి.లచ్చిరెడ్డి, రతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి పనిచేయాలి

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కోదాడ, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపడుతున్న అభివృద్ధి పనులు నచ్చడం వల్లే చాలా మంది పార్టీలో చేరుతున్నారని హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోదాడ నియోజకవర్గాల్లోని పలు మండలాలకు చెందిన వారు గురువారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి వేర్వేరుగా కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త, పాత  వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభా స్థలాన్ని పరిశీలించారు. 

స్టూడెంట్లు అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలి

యాదాద్రి, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన ఎడ్యుకేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లు తయారు చేసిన బ్యాగులు, అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లలోని పిల్లల కోసం కుట్టిన డ్రెస్సులను గురువారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్టూడెంట్లు ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు.

బాలలతో పనిచేయిస్తే కఠిన చర్యలు

సూర్యాపేట, వెలుగు : బాలలతో పనిచేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంలో భాగంగా గురువారం వివిధ శాఖల ఆఫీసర్లతో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లేబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ, షీటీం, రెవెన్యూ శాఖలతో పాటు పోలీసులు కో ఆర్డినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పనిచేయాలని సూచించారు. గతేడాది జిల్లాలో 270 మంది చిన్నారులను గుర్తించినట్లు చెప్పారు. బాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వెట్టి చాకిరీ చేయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామారావు, డీఎస్పీ నాగభూషణం, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చైల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు రవికుమార్, నాగరాజు, నాగులమీరా పాల్గొన్నారు.