భద్రాచలం, వెలుగు : శ్రీవైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి గురువారం తన నిజరూపమైన శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో స్వామి మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. ఉత్సవమూర్తులను శ్రీరామావతారంలో అలంకరించారు. మహాచక్రవర్తి రామయ్యకు భక్తరామదాసు చేయించిన బంగారు ఆభరణాలు చింతాకు పతకం, పచ్చలపతకం, శ్రీరామమాడలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రాకార మండపానికి తీసుకొచ్చి వేదవిన్నపాలు, చతుర్వేద పారాయణాలు, భద్రాద్రిక్షేత్ర మహత్యం సమర్పించారు. స్వామివారిని ఊరేగింపుగా వైకుంఠ ద్వారం ఎదురుగా ఉన్న అధ్యయన వేదికపైకి తీసుకొచ్చారు. దారిపొడవునా కోలాటాలు, రామనామ స్మరణలతో భక్తులు స్వామికి స్వాగతం పలికారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలతో ఊరేగింపు సాగింది.
హంస వాహనం ట్రయల్ రన్
గోదావరిలో గురువారం హంస వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్డీవో, దేవస్థానం ఈవో, ఇరిగేషన్ ఈఈ, టెంపుల్ ఈఈలు గోదావరిలో హంసవాహనాన్ని తిప్పారు. గోదావరి ప్రవాహం, లోతు, ప్రస్తుత నీటిమట్టం, తెప్పోత్సవం రోజు పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాలను పరిశీలించారు. ఇక తెప్పోత్సవం ఏర్పాట్లను ఏఎస్పీ రోహిత్ రాజు, సీఐ నాగరాజురెడ్డి, ఎస్సై మధుప్రసాద్ పరిశీలించారు. డీఈ రవీందర్రాజుతో కలిసి ర్యాంపును తనిఖీ చేశారు. భద్రత దృష్ట్యా దేవుడితో పాటు ఆ రో జు ఎంత మందిని హంస వాహనంపైకి అనుమతిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాంపు పటిష్టతను పరిశీలించి పలు సూచనలు చేశారు.
రైల్వే అధికారులపై ఎంపీ నామా ఆగ్రహం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం రైల్వే అధికారులపై బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి స్టేషన్లో సౌలతులు సరిగా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. ఫ్లాట్‌ఫామ్‌లను పరిశీలించి పారిశుధ్యం సరిగా లేదన్నారు. స్టేషన్లో మంచి నీటి క్యాబిన్ మూసి ఉండడడంతో ప్యాసింజర్లకు మంచి నీళ్లు ఎలాగని ప్రశ్నించారు. గ్రీనరీని ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉంచాలని సూచించారు. 8 సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయని, మరో 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
అనంతరం సారథినగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించే స్థలాన్ని పరిశీలించి, సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు ప్రారంభించాలని సూచించారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపీ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. రైల్వేకు సంబంధించిన పలు విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ములకలపల్లి/చండ్రుగొండ: ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి పర్యటించారు. నవ దంపతులను ఆశీర్వదించడంతో పాటు ఇటీవల మృతి చెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను అందజేశారు.
ఉద్యోగం ఇస్తలేరని ఫిర్యాదు..
అన్నపురెడ్డిపల్లి: విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి ఇస్తే ఏండ్లు గడుస్తున్నా తన కుమారుడికి ఉద్యోగం రాలేదని ఎంపీ, ఎమ్మెల్యేలకు భూ నిర్వాసితుడు మాదాసు ఎల్లయ్య ఫిర్యాదు చేశాడు. ఉన్న ఎకరం భూమి ని 2014లో పెంట్లం గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఇచ్చానని, భూమి పోయినా కొడుకుకు ఉద్యోగం వస్తుందని ఏండ్లుగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. స్పందించిన ఎంపీ వెంటనే సీఎండీ గోపాలరావుకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరారు.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ వ్యవస్థ కీలుబొమ్మగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రాలకు ప్రయోజనం లేని గవర్నర్ వ్యవస్థ అవసరం లేదంటూ కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నల్ల బట్టలు ధరించి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను ఆసరా చేసుకొని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్పాషా, బందెల నర్సయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, వై శ్రీనివాస్‌రెడ్డి. ఎస్ శ్రీనివాస్‌రెడ్డి, శేషయ్య, మల్లికార్జున్‌రావు, భాస్కర్, జమలయ్య, వంగా వెంకట్, రత్నకుమారి పాల్గొన్నారు.
మేజర్ పంచాయతీతోనే మనుగడ
భద్రాచలం, వెలుగు: మేజర్ గ్రామపంచాయతీగా ఉంటేనే భద్రాచలం పట్టణానికి మనుగడ ఉంటుందని వ్యాపారులు, ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గురువారం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో భేటీ అయ్యారు. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విడగొడుతూ జారీ చేసిన జీవో నెం.45ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం పట్ల సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఎమ్మెల్యే చేసే పోరాటానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
‘ఉత్పత్తితో పాటు సేఫ్టీకి ప్రాధాన్యమివ్వాలి’
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించారు. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్‌లో గురువారం యాన్యువల్ మీటింగ్ నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ డిప్యూటీ సెక్రటరీ సోలంకి, తెలంగాణ స్టేట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఎల్లయ్య, సింగరేణి డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం, డి సత్యనారాయణ, డైరెక్టర్ డాక్టర్ రమణ పాల్గొన్నారు. అకౌంట్స్‌తో పాటు ఈ ఏడాది సాధించిన ప్రగతిని డైరెక్టర్లు వివరించారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓసీపీని సందర్శించారు. కోల్ ప్రొడక్షన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏరియాలోని ఏకో పార్క్‌ను సందర్శించి మొక్కను నాటారు. రక్షణతో కూడిన ఉత్పత్తికి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జనరల్ మేనేజర్ జక్కం రమేశ్, ఎస్ఓ టూ జీఎం నారాయణరావు, అధికారులు రమేశ్, మురళి, శామ్యూల్, సుధాకర్, దిలీప్‌కుమార్, సుధాకర్, కో ఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు.
‘షార్ట్ కట్ రాజకీయాలు పని చేయవు’
సత్తుపల్లి, వెలుగు: పెద్దమనిషిగా చెలామణి అవుతూ చిల్లర రాజకీయాలు తగవని, ముసుగు తీసి రాజకీయాలు చేస్తే మంచిదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. గురువారం క్యాంపు ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది తప్పుడు పద్ధతిలో, షార్ట్ కట్ మెథడ్ లో రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇటువంటి వాటితో ప్రజల్లో చులకన అవుతారన్నారు. మూడేళ్లలో సత్తుపల్లి పట్టణానికి రూ.60 కోట్ల నిధులు సమకూర్చానని, రూ.50 కోట్ల సీడీఎఫ్ ఫండ్స్ మంజూరవుతాయని చెప్పారు. ఖమ్మంలో ఎన్ఎస్పీ క్వార్టర్ తనకు రెగ్యులరైజ్ కాలేదని, ఇప్పటికీ ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్నానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, దొడ్డ శంకర్ రావు, వల్లభనేని పవన్, కనగాల వెంకట్రావు, పాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
నిజరూపంలో రామయ్య దర్శనం