ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్, వెలుగు: గుండ్లపల్లె, పొత్తూరు రెండు వరసల రహదారి విషయంలో రాజకీయ డ్రామాలు మాని మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రహదారుల అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పంపితే, కొన్నింటికే అనుమతి ఇచ్చారన్నారు. ప్రభుత్వం అడ్డుకున్న వాటిలో గుండ్లపల్లి పొత్తూరు డబుల్​లైన్​రోడ్ కూడా ఉందన్నారు. సమావేశంలో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు 
వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఏర్పాటుతోనే వాల్మీకీలకు గుర్తింపు

జగిత్యాల రూరల్, వెలుగు: తెలంగాణ ఏర్పాటు తర్వాతే వాల్మీకీ బోయలకు గుర్తింపు వచ్చిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని సోమవారం జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్​వద్ద నిరసన దీక్ష చేస్తున్న వారికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. బోయల రిజర్వేషన్ కోసం సీఎం కేసీఆర్ చెల్లప్ప కమిషన్ వేశారన్నారు. రాష్ట్రంలో వాల్మీకీ బోయలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి తనవంతు సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిరసనలో కేడీసీసీ జిల్లా మెంబర్ ఎం. రామచంద్రరావు, కౌన్సిలర్ కె.అనిల్, నాయకులు పాల్గొన్నారు.

వేలం ద్వారా 60 ప్లాట్ల అమ్మకం

కరీంనగర్, వెలుగు: ప్రత్యక్ష వేలం ద్వారా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం అంగారక టౌన్ షిప్ లో 60 ప్లాట్లను అమ్మినట్లు కరీంగనర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. సోమవారం పట్టణంలోని వాసర గార్డెన్ లో అంగారక టౌన్​షిప్ లోని ప్లాట్ల వేలంలో ఆయన మాట్లాడారు. టౌన్ షిప్ లోని 656 ప్లాట్లు ఉండగా సోమవారం 60 ప్లాట్లు  వేలం వేశామన్నారు. నవంబర్ 25 వరకు ప్రక్రియ నడుస్తుందన్నారు. నంబర్238 నుంచి297 వరకు ప్లాట్ లు అమ్మగా రూ.11.49 కోట్లు వచ్చాయని కలెక్టర్​తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, అధికారులు  తదితరులు పాల్గొన్నారు

ఘనంగా బాలల దినోత్సవం

విద్యార్థుల కలలు సాకారం కావాలంటే చదువుతోనే సాధ్యమని కరీంనగర్​ కలెక్టర్ కర్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్​కట్​చేశారు. అడిషనల్​ కలెక్టర్ గరిమ, డీడబ్ల్యూఓ సబిత, డీఈఓ జనార్దన్ రావు, స్టూడెంట్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ప్రిన్సిపాల్ పల్లె రాజిరెడ్డి ఆధ్వర్యంలో చిల్ర్డన్స్ డే  నిర్వహించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో బాలల దినోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు డాన్స్​తో అలరించారు. అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, పెగడపల్లిలోని క్రీసెంట్ఉన్నత పాఠశాలలో వేడుకలు నిర్వహించారు.  అలాగే  ఎస్ఆర్​ ప్రైమ్​ స్కూల్, ప్యారడైజ్, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ లలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ‌‌‌‌‌‌‌‌ -  వెలుగు నెట్ వర్క్​

ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం

గోదావరిఖని, వెలుగు : ప్రధాని మోడీ రామగుండం సభలో సింగరేణి సంస్థను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేయడంపై బీజేపీ, బీఎంఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం గోదావరిఖనిలో పటాకులు కాల్చారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఎంఎస్‌‌‌‌‌‌‌‌ అనుబంధ సింగరేణి కోల్‌‌‌‌‌‌‌‌మైన్స్‌‌‌‌‌‌‌‌ కార్మిక సంఘ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, బీజేపీ లీడర్లు కౌశిక హరి, సోమారపు అరుణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు కావాలనే కేంద్రపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2014 వరకు సింగరేణిలో 35 భూగర్భ గనులు ఉండగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చాక 11 భూగర్భ గనులు మూసివేశారన్నారు. 62 వేల మంది కార్మికులుండగా 42 వేల మందికి కుదించారని తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు ఎస్.లావణ్య, బి.అమరేందర్‌‌‌‌‌‌‌‌ రావు, కె. మహేశ్, ఎం.రామన్న, ఎ. హరిణ్, ఎస్. సతీశ్​ పాల్గొన్నారు.