కరీంనగర్ క్రైం, వెలుగు: పోలీసు అమరవీరుల వారోత్సవాలు (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని గురువారం కరీంనగర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గీత భవన్ చౌరస్తా నుంచి పోలీస్అమరవీరుల స్మారక స్తూపం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో పోలీసులు, ప్రజలు పాల్గొని పోలీస్అమరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు సమాజం శాంతియుతంగా ఉందన్నారు. అమరుల ఆశయాల సాధనకు అంకితభావంతో కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాస్ (లాఅండ్ఆర్డర్), జి.చంద్రమోహన్ (అడ్మినిస్ట్రేషన్), ఏసీపీలు, కరుణాకర్ రావు, ప్రతాప్, ఎస్బీఐ జి.వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు నటేశ్, లక్ష్మీ బాబు, దామోదర్ రెడ్డి, తిరుమల్, రాజకుమార్, కిరణ్ కుమార్, మల్లేశం, మురళి, విద్యార్థులు పాల్గొన్నారు.
పన్నులు తగ్గించాలంటూ బైక్ ర్యాలీ
చొప్పదండి,వెలుగు: పెరిగిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్‌చేస్తూ చొప్పదండి టౌన్లో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, వ్యాపారులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డ్స్ పట్టుకొని ర్యాలీ చేపట్టారు. జేఏసీ లీడర్లు మాట్లాడుతూ పంచాయతీ నుంచి మున్సిపల్‌గా మారినప్పటికీ ఎలాంటి అధివృద్ధికి నోచుకోలేదని, పైగా పన్నులు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పన్నులను తగ్గించాలని శుక్రవారం సాయంత్రం దీపారాధన చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీసీఓ ఇంద్రసేనా రెడ్డి, జేఏసీ సభ్యులు సత్యనారాయణ, మహేశ్, మునీందర్, కుల సంఘాల అధ్యక్షులు, వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు.
మొబైల్ ల్యాబ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లి, గోదావరిఖని, వెలుగు: మొబైల్సైన్స్ ల్యాబ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సూచించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో గురువారం కలెక్టర్ పర్యటించారు. ఈసందర్బంగా అంగన్వాడీ సెంటర్లు, జడ్పీహెచ్ఎస్ స్కూల్‌ను తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మొబైల్మ్యాథ్స్ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థుల్లో నాలెడ్జ్ పెంచేందుకు ప్రయోగాత్మక బోధనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు , అధికారులు పాల్గొన్నారు.
రేపటి తరాల కోసం పోలీసుల ఆత్మత్యాగం
జగిత్యాల, వెలుగు: రేపటి తరాల కోసం పోలీసులు ఆత్మత్యాగం చేశారని, వారి త్యాగాలను వెలకట్టలేమని ఎస్పీ సింధు శర్మ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా గురువారం జగిత్యాలలో పోలీస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేసినప్పుడే పోలీస్ అమరుల త్యాగానికి నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు ప్రకాశ్, రవీంద్ర రెడ్డి, సీఐలు కిషోర్, కృష్ణ కుమార్, రమణ మూర్తి, కోటేశ్వర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వామన మూర్తి, నవీన్, ఎస్ఐ లు, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సుందరీకరణ పేరుతో ప్రజాధనం వృథా
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని మార్కండేయ కాలనీ రాజేశ్థియేటర్ టీ‒జంక్షన్ సుందరీకరణ పేరుతో రోడ్డు తవ్వి ప్రజలను ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుమన్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కాలేజీలు, హాస్పిటళ్లు ఎక్కువగా ఉన్నాయని, రోడ్డు తవ్వడంతో స్కూల్ బస్సులు, అంబులెన్స్‌లు తిరగడానికి ఇబ్బందిగా ఏర్పడుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జెవి రాజు, ఉపాధ్యక్షులు వేముల అశోక్, బి గోపాల్, జనగామ తిరుపతి, విక్రంసింగ్, ముకేశ్ పాల్గొన్నారు.
సర్పంచ్ల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే
మెట్ పల్లి, వెలుగు: పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని.. సొంత డబ్బు ఖర్చు పెట్టిన సర్పంచ్‌లు అప్పులపాలై సూసైడ్చేసుకుంటారని సుప్రీంకోర్టు అడ్వకేట్కోమిరెడ్డి కరంచంద్ అన్నారు. గురువారం మెట్పల్లిలో మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ల ఆత్మహత్యలన్నీ సర్కార్హత్యలేనన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ సర్పంచ్ సంతోష్ ఆత్మహత్య ముమ్మాటికీ సర్కారు హత్యేనని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అసమర్థత వల్లే నియోజకవర్గంలోనీ గ్రామాల బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయని ఆరోపించారు.
డబుల్ ఇండ్లు ఇవ్వాలని వినూత్న నిరసన
ముస్తాబాద్ వెలుగు: డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లిలో లబ్ధిదారులతో కలిసి బీజేపీ లీడర్లు వినూత్న నిరసన చేపట్టారు. గురువారం మొర్రాయిపల్లి పంచాయతీ ఆఫీస్వద్ద కేటీఆర్ఫొటో ధరించిన వ్యక్తిచే పందిరిలా ఏర్పాటు చేసిన డమ్మీ ఇంటికి గులాబీ కలర్రిబ్బన్కట్చేయించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ మొర్రాయిపల్లె గ్రామానికి ఇప్పటివరకు ఒక్క డబుల్బెడ్రూం ఇంటిని మంజూరు చేయలేదన్నారు. ఇండ్లు కట్టకుండానే రెండుసార్లు లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు కోల కృష్ణ, లీడర్లు క్రాంతి , మహేందర్, జనార్ధన్, ఆది శేఖర్ , బాల్ రెడ్డి, మల్లారెడ్డి , నరేశ్, వేణు, తిరుపతి, జిల్లెల్ల మల్లేశం పాల్గొన్నారు.
అఖిలపక్షంతో బాధితులకు న్యాయం జరగదు
గోదావరిఖని, వెలుగు : ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియమించుకున్న అఖిలపక్షంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ లో ఉద్యోగాల కోసం డబ్బులు పెట్టి మోసపోయిన బాధితులకు న్యాయం జరగదని సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. గురువారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అనుచరులు ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేశారని, కానీ ఇన్ని రోజులైనా ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదన్నారు. అఖిలపక్షంలో సఖ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా లీడర్లు మాట్లాడుతున్నారని, దసరాకు ముందే బాధితులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పారని, కానీ వారికి న్యాయం జరగనందున అఖిల పక్షం నుంచి సీపీఐ తప్పుకుంటున్నదని ఆయన ప్రకటించారు. మీటింగ్‌లో లీడర్లు గోసిక మోహన్, కె.కనకరాజ్, మద్దెల దినేశ్, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల పరిశీలన
కరీంనగర్ సిటీ, వెలుగు: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన జలశక్తి అభియాన్, ఉపాధి హామీ పనులను నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ షోయబ్ అహ్మద్ కలాల్ పరిశీలించారు. గురువారం తిమ్మాపూర్ మండలం కేంద్రంతోపాటు పర్లపల్లి గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చేపడుతున్న జల శక్తి అభియాన్, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. తిమ్మాపూర్ ఎంపీపీ ఆఫీసులో ఏర్పాటుచేసిన ఇంకుడు గుంతలను, మియావాకి, నర్సరీ, పీహెసీలో ఇంకుడు గుంతలు, గర్భిణులకు అందించే సేవలు, కేసీఆర్‌కిట్, ఆన్లైన్లో గర్భిణుల వివరాల నమోదు తదితరాలను పరిశీలించారు. అనంతరం మండలంలోని పర్లపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, నీతి ఆయోగ్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్‌శర్మ, తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి, వనిత, దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ కనకయ్య, ఏపీవో, డీఆర్డీఏ సిబ్బంది
పాల్గొన్నారు.