ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఆ ఫలాలు మాత్రం అణగారిన వర్గాలకు అందడం లేదని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా గౌరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహోత్సవాల్లో భాగంగా నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్యతో కలిసి సోమవారం యాదగిరిగుట్ట నుంచి భువనగిరి వరకు పాదయాత్ర నిర్వహించారు. కల్లూరి రాంచంద్రారెడ్డి, ఎంపీపీ శ్రీశైలం, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి మండలాల అధ్యక్షులు బాలరాజుగౌడ్, మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి, వెలుగు : రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరిని యాదాద్రి జిల్లా భువనగిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి ఏసీపీ వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరికి చెందిన సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు పలువురిని నమ్మించారు. రూ. లక్ష చెల్లిస్తే మూడు నెలల్లోనే రూ. 1.50 లక్షలు ఇస్తామని చెప్పడంతో పాటు, రూ. 100 బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసిచ్చేవారు. దీంతో పలువురు వ్యక్తులు వారిని నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చారు. ఎన్ని రోజులు గడిచినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో భువనగిరికి చెందిన సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు సమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వారి వద్ద నుంచి మోత్కూరులో ఖాళీ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సింగన్నగూడెంలోని ఇంటి కాగితాలతో పాటు 29.3 తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, మూడు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రెండు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. 

కారు ఢీకొని యువకుడు మృతి

నార్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : కారు ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన కాశీనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దివాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్నూలే కొన్ని రోజులుగా వెలిమినేడు శివారులోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆదివారం తన ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రితిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి సరుకుల కోసం చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. రాత్రి పెద్దకాపర్తి శివారులో ఆటో దిగి రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో గుర్నూలే స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయాడు.