ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చౌటుప్పల్/మునుగోడు, వెలుగు : రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను ఓట్లు అడిగేందుకు వెళితే తమను ఎక్కడ కొడతారోనని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ లోని మూడో వార్డు అయిన లింగోజిగూడెంలో సీఐటీయూ, ఏఐటీయూసి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నందున ఇక ఈ ప్రాంతానికి తిరుగుండదన్నారు. వెంట రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భార్య అరుణా రెడ్డి, బిడ్డ రమ్య రెడ్డి, కోడలు స్రవంతి రెడ్డి ఉన్నారు. అలాగే మునుగోడు మండలంలోని కొంపల్లిలో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులకు, చేతివృత్తులకు పూర్వ వైభవం తెచ్చారన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు, టీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు. 

ఈజీగా అర్థమయ్యేలా చదువు చెప్పాలి

యాదగిరిగుట్ట, వెలుగు : స్టూడెంట్లకు ఈజీగా అర్థమయ్యే రీతిలో బోధన ఉండాలని స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ దేవసేన సూచించారు. మౌలిక బాషా గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, ఆలేరు మండలం పటేల్‌‌‌‌గూడెం ప్రైమరీ స్కూళ్లను గురువారం ఆమె సందర్శించారు. క్లాస్‌‌‌‌రూంలలో బోధనాభ్యసన ప్రక్రియను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీచర్లకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట కలెక్టర్‌‌‌‌ పమేలా సత్పతి, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ దీపక్‌‌‌‌ తివారి, డీఈవో నారాయణరెడ్డి పాల్గొన్నారు.

అన్ని గ్రామాలకు ‘భగీరథ’ నీళ్లివ్వాలి

సూర్యాపేట, వెలుగు : మిషన్‌‌‌‌ భగీరథ పథకం కింద అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌ పాటిల్‌‌‌‌ హేమంత్‌‌‌‌ కేశవ్‌‌‌‌ ఆదేశించారు. మిషన్‌‌‌‌ భగీరథ ఆఫీసర్లతో గురువారం కలెక్టరేట్‌‌‌‌లో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ని రోజులకు ఒకసారి ఓహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ క్లీనింగ్, వాటర్ టెస్టింగ్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో జరిగే మీటింగ్‌‌‌‌లకు మిషన్‌‌‌‌ భగీరథ ఆఫీసర్లు మండలాల వారీ రిపోర్టుతో రావాలని సూచించారు. ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌లో ఏమైనా ఇబ్బందులు వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్‌‌‌‌ భగీరథ ఇంట్రా యూనిట్ ఆఫీసర్‌‌‌‌ వి.పాపారావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా పెన్‌‌‌‌పహాడ్‌‌‌‌లోని రేషన్‌‌‌‌షాపును తనిఖీ చేశారు. టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌, డీలర్‌‌‌‌ పేరు, సరుకుల వివరాలు డిస్‌‌‌‌ప్లే చేయకపోవడంతో ఇన్‌‌‌‌చార్జి డీలర్‌‌‌‌ సునందపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్‌‌‌‌ సప్లై అసిస్టెంట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ వి. పుల్లయ్య, డీటీ నాగలక్ష్మి పాల్గొన్నారు.
 

గొర్రెల పంపిణీపై బీజేపీ కుట్ర

సూర్యాపేట, వెలుగు : గొర్ల కాపరులకు బీజేపీ వ్యతిరేకమని డీసీఎంఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వట్టె జానయ్యయాదవ్‌‌‌‌ అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ, నగదు బదిలీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గురువారం విజయవాడ – హైదరాబాద్‌‌‌‌ నేషనల్‌‌‌‌ హైవే రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేపట్టొద్దన్న కుట్రతోనే బీజేపీ లీడర్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సూచించారు. విషయం తెలుసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో జానయ్య యాదవ్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసి సూర్యాపేట రూరల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు తరలించారు. ఆయనను విడుదల చేయాలని యాదవ సంఘం లీడర్లు స్టేషన్‌‌‌‌ వద్ద ధర్నా నిర్వహించారు. 

అభివృద్ధి కోసమే రాజగోపాల్‌‌రెడ్డి రాజీనామా

చండూరు, వెలుగు : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి రాజీనామా చేశారని ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మి చెప్పారు. నల్గొండ జిల్లా చండూరులో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడున్నరేళ్లు ఎంత కొట్లాడినా మునుగోడు అభివృద్ధికి కేసీఆర్‌‌ నిధులివ్వలేదని ఆరోపించారు. తన రాజీనామాతోనైనా నిధులు వస్తాయన్న ఉద్దేశంతోనే పదవిని వదిలేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి రాజగోపాల్‌‌రెడ్డిని గెలిపించాలని కోరారు. 

అన్ని గ్రామాలకు ‘భగీరథ’ నీళ్లివ్వాలి

సూర్యాపేట, వెలుగు : మిషన్‌‌‌‌ భగీరథ పథకం కింద అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌ పాటిల్‌‌‌‌ హేమంత్‌‌‌‌ కేశవ్‌‌‌‌ ఆదేశించారు. మిషన్‌‌‌‌ భగీరథ ఆఫీసర్లతో గురువారం కలెక్టరేట్‌‌‌‌లో మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ని రోజులకు ఒకసారి ఓహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ క్లీనింగ్, వాటర్ టెస్టింగ్ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో జరిగే మీటింగ్‌‌‌‌లకు మిషన్‌‌‌‌ భగీరథ ఆఫీసర్లు మండలాల వారీ రిపోర్టుతో రావాలని సూచించారు. ఫీల్డ్‌‌‌‌ లెవల్‌‌‌‌లో ఏమైనా ఇబ్బందులు వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్‌‌‌‌ భగీరథ ఇంట్రా యూనిట్ ఆఫీసర్‌‌‌‌ వి.పాపారావు, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా పెన్‌‌‌‌పహాడ్‌‌‌‌లోని రేషన్‌‌‌‌షాపును తనిఖీ చేశారు. టోల్‌‌‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌, డీలర్‌‌‌‌ పేరు, సరుకుల వివరాలు డిస్‌‌‌‌ప్లే చేయకపోవడంతో ఇన్‌‌‌‌చార్జి డీలర్‌‌‌‌ సునందపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్‌‌‌‌ సప్లై అసిస్టెంట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ వి. పుల్లయ్య, డీటీ నాగలక్ష్మి పాల్గొన్నారు.

అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ రెవెన్యూ శివారులో ఉన్న 126, 110 సర్వే నంబర్‌‌‌‌లో గల ప్రభుత్వ భూమిలో అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు  నాగార్జునరెడ్డి డిమాండ్‌‌‌‌ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుడకుడ రెవెన్యూ శివారులోని భూములను కొందరు రియల్‌‌‌‌ వ్యాపారులు, భూస్వాములు ఆక్రమిస్తున్నా, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పేదలు ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేని పేదలను గుర్తించి ప్రతి ఒక్కరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. అనంతరం ఆర్డీవో ఆఫీస్‌‌‌‌ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, చినపంగి నర్సయ్య, వీరబోయిన రవి, సీపీఎం శాఖ కార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

ఓటు హక్కు కోసం అప్లై చేసుకోండి

సూర్యాపేట, వెలుగు : ఓటు హక్కు కోసం 18 ఏళ్లు నిండిన వారు అప్లై చేసుకోవాలని సూర్యాపేట అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ ఎస్‌‌‌‌.మోహన్‌‌‌‌రావు సూచించారు. కొత్త పోలింగ్‌‌‌‌ కేంద్రాలు, పేరు, లొకేషన్‌‌‌‌ మార్పుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం మీటింగ్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 1,168 పోలింగ్‌‌‌‌ కేంద్రాలు ఉండగా, పేరు మార్పు కోసం రెండు ప్రపోజల్స్‌‌‌‌ అందాయన్నారు. కొత్త ఓటర్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ విడుదల కంటే ముందు రాజకీయ పార్టీల లీడర్లు బూత్‌‌‌‌ లెవల ఏజెంట్లను నియమించుకోవాలని సూచించారు. చనిపోయిన, గ్రామంలో లేని వారి ఓట్లను తొలగించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 79.04 శాతం ఆధార్‌‌‌‌ లింకేజీ పూర్తైందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్రప్రసాద్, కిశోర్‌‌‌‌కుమార్‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌ వెంకన్న, రాజకీయ ప్రతినిధులు కోట గోపి, డి.రాంబాబు, వి.ఉపేందర్ పాల్గొన్నారు.

వారిని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్

చౌటుప్పల్, వెలుగు : కేసీఆర్, ఆయన కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీజేపీ లీడర్లు, సినీ నటులు జీవిత, కవిత అన్నారు. గురువారం చౌటుప్పల్​లో సినీ నటి కవిత, దేవలమ్మ నాగారంలో జీవిత బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సమస్యలను వదిలి ఢిల్లీకి వెళ్తున్నా అని చెబుతున్నారన్నారు. ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకుల నోళ్లు మూయించేలా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఉండబోతోందన్నారు.  

‘గీత’ వృత్తి రక్షణకు పోరాటం చేయాలి

యాదగిరిగుట్ట, వెలుగు : కల్లు గీత వృత్తి రక్షణ, ఉపాధి సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని చేతి వృత్తిదారుల సమన్వయ సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కల్లెపు వెంకటయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం జరిగిన కల్లుగీత కార్మిక సంఘం ప్రతినిధుల మీటింగ్‌‌‌‌లో వారు మాట్లాడారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఆర్థికంగా పటిష్టం చేసేందుకు రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ప్రతి కల్లుగీత సొసైటీకి 5 ఎకరాలు కేటాయించి, తాటి, నీరా ఉత్పత్తి కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరారు. తాటిచెట్టు పైనుంచి పడి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరిటి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షలు, రూ. 5 వేల పింఛన్‌‌‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గౌడ్, నాయకులు వెంకటేశ్‌‌‌‌గౌడ్, శ్రీరామమూర్తి పైళ్ల ఆశయ్య, విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌గౌడ్‌‌‌‌, సుధహేమేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌ పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో మేలు

గరిడేపల్లి, వెలుగు : ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సూర్యాపేట జిల్లా హార్టికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ బి. శ్రీధర్‌‌‌‌ చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి అరబిందో కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూతాపం పెరగడం, వాతావరణ మార్పులకు ప్రస్తుత వ్యవసాయ విధానమే కారణమన్నారు. వీటిని ఎదుర్కోవాలంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయానికి 10 శాతం విద్యుత్,10 శాతం నీరు సరిపోతుందన్నారు. కార్యక్రమంలో కేవీకే ఇన్‌‌‌‌చార్జి ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌‌‌‌ బి.లవకుమార్, హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ పి.సంధ్యారాణి, ఎం.సురేశ్‌‌‌‌గుప్తా, మహిళ రైతు శశికళ, కేవీకే సైంటిస్ట్‌‌‌‌లు కిరణ్, నరేశ్‌‌‌‌, మాధురి, ఆదర్శ్ పాల్గొన్నారు.