ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వీకెండ్‌‌‌‌‌‌‌‌ కావడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు, ఆలయ ప్రాంగణం, కల్యాణకట్ట, వ్రత మండపాలు, శివాలయం రద్దీగా కనిపించింది. భక్తులతో ధర్మదర్శన క్యూలైన్లు, అష్టభుజి ప్రాకార మండపాలు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్‌‌‌‌‌‌‌‌ దర్శనానికి గంట సమయం పట్టింది. మరో వైపు ఆలయంలో నిత్య పూజలు వైభవంగా కొనసాగాయి.ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపు సేవతో ముగిశాయి. ఆలయ మాడవీధుల్లో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా శనివారం ఆలయానికి రూ.32,44,290 ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.14,05,900, కొండపైకి వెహికల్స్‌‌‌‌‌‌‌‌ ప్రవేశంతో రూ.4.50 లక్షలు, వ్రత పూజల ద్వారా రూ.2,12,800, వీఐపీ దర్శనాలతో రూ.2.55 లక్షలు, బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శన టికెట్లతో రూ.1,96,200 ఇన్‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. 


గిరిజనులను ఓటు బ్యాంక్‌‌‌‌‌‌‌‌గానే చూస్తున్రు: ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి

మునగాల (మోతె), వెలుగు : గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడంలో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం విఫలమైందని నల్గొండ ఎంపీ ఎం.ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తోందని, వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడం సరికాదన్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం దళితులు, గిరిజనులు, బడుగు బలహీనవర్గాలకు అమలుకాని వాగ్ధానాలు చేస్తూ కాలం వెల్లదీస్తోందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దళితులకు మూడు ఎకరాల భూమి హామీ అమలులో విఫలమైందన్నారు. మాయమాటలు చెప్పి వచ్చే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఈ సారి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ జెండా దిమ్మెను ఆవిష్కరించారు. అంతకుముందు రాంపురంతాడంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠాపనలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కీసర సంతోశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి, మామిల్లగూడెం, అన్నారుగూడెం సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు ఎల్లయ్య, జి.వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, మాజీ ఎంపీటీసీ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం హాలియా క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే నోముల భగత్‌‌‌‌‌‌‌‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ పెండ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌ పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య, నాయకులు బాబురావునాయక్, కాంసాని సాంబశివారెడ్డి, ఎంపీటీసీ భార్గవి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పోతుగంటి తిరుమల్, జాటావత్‌‌‌‌‌‌‌‌ సుజాత పాండునాయక్, స్వాతి పాల్గొన్నారు.

 

  • ఆఫీసర్ల తీరు సరిగా లేదు

  • నల్గొండ స్థాయీ సంఘాల మీటింగ్‌‌‌‌‌‌‌‌లో సభ్యుల ఆగ్రహం

  • పనితీరు మార్చుకోవాలన్న జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌

 నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : సమస్యల పరిష్కారానికి ఆఫీసర్లు సహకరించడం లేదని, తమను సంప్రదించకుండానే అభివృద్ధి పనుల ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపుతున్నారని జడ్పీ సభ్యులు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షతన శనివారం వర్క్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, వైస్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన వ్యవసాయం, ఇతర కమిటీల మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాగానే పలువురు జడ్పీటీసీలు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి జడ్పీటీసీ మాట్లాడుతూ ఆఫీసర్లు తమను సంప్రదించకుండానే రోడ్ల పనులకు సంబంధించిన ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ ఎట్లా పంపిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే రోడ్లు, ప్యాచ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లకు సంబంధించిన ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపినట్లు పీఆర్‌‌‌‌‌‌‌‌ ఈఈ సమాధానం ఇచ్చారు. అనంతరం నల్గొండ జడ్పీటీసీ మాట్లాడుతూ జీకే అన్నారంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌ కావాలని 15 రోజుల నుంచి ఆఫీసర్లను అడుగుతున్నా పట్టించుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిప్పర్తి జడ్పీటీసీ, ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ పాశం రాంరెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎన్ని ఐకేపీ సెంటర్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేశారో ఎందుకు చెప్పడం లేదన్నారు. పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు కఠినంగా వ్యవహరిస్తున్నారని, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇప్పించాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ కోరారు. అనంతరం జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ఆఫీసర్లు తమ పనితీరు మార్చుకోవాలని, సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆఫీసర్లపైనే ఉందన్నారు. సమావేశంలో సభ్యులు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జడ్పీ సీఈవో ప్రేమ్‌‌‌‌‌‌‌‌కరణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ పాల్గొన్నారు.


కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను త్వరగా పూర్తి చేయాలి

సూర్యాపేట, వెలుగు : కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. శనివారం ఆయన ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఎం.యాకుబ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ గోవర్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఉన్నారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి క్రిస్మస్‌‌‌‌‌‌‌‌ సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీని నియమించారు. క్రిస్మస్‌‌‌‌‌‌‌‌ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.మోహన్‌‌‌‌‌‌‌‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ డీడబ్ల్యూవో శంకర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై చర్య తీసుకోండి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : దేశం కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోందని, ఇది చాలా ప్రమాదకరమైన పరిణామమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా రైతు కూలీ పోరాట సమితి, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారంలో నల్గొండలో జరిగిన అమరుల సంస్మరణ సభలో ఆమె మాట్లాడారు. విద్య కాషాయీకరణకు బలవుతోందన్నారు. దేశంలో అంబానీ, ఆదానీల ఆదాయం పెరుగుతోందని, పేదల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదన్నారు. మార్పును కోరుకొనే శక్తులు ఏకం కావాలని చెప్పారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, పీడీఎస్‌‌‌‌‌‌‌‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెబోయిన జాని, మోహన్‌‌‌‌‌‌‌‌ బైరాగి, మల్సూర్, రైతు కూలీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పటోళ్ల నాగిరెడ్డి, బొమ్మకంటి కొమురయ్య, ఏఎఫ్‌‌‌‌‌‌‌‌టీయూ నాయకులు మల్లేశం, సైదులు పాల్గొన్నారు.

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నల్గొండలో జరిగిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి, యాదాద్రిలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి, సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌రావు హాజరై మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పాలన, సమ న్యాయం అందించేందుకు రాజ్యాంగం మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిందన్నారు. రాజ్యాంగంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.  - వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌

ఎన్‌‌‌‌‌‌‌‌సీసీలో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌కు జాతీయ అవార్డు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరు హైస్కూల్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ దూడల వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ డీజీ కమాండేషన్‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. 75వ ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ డే సందర్భంగా 2022–-23 సంవత్సరానికి సంబంధించి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌కు ఈ అవార్డు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ నుంచి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ ఒక్కరే ఎంపిక కావడం పట్ల టెన్త్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ బెటాలియన్‌‌‌‌‌‌‌‌ కమాండ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ కల్నల్‌‌‌‌‌‌‌‌ అజయ్‌‌‌‌‌‌‌‌ నంద ఖండూరి, అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ లెఫ్టినెంట్‌‌‌‌‌‌‌‌ కల్నల్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌ జగతప్‌‌‌‌‌‌‌‌ హర్షం  వ్యక్తం చేశారు. 

నేటి నుంచి నల్గొండలో రైతు సంఘం మహాసభలు

నల్గొండ​, వెలుగు : రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు ఆదివారం నుంచి నల్గొండలో ప్రారంభం కానున్నాయి. 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి రైతు సంఘం నాయకులు, రైతులు హాజరుకానున్నారు. రాష్ట్ర మహాసభల్లో భాగంగా మొదటిరోజైన ఆదివారం పట్టణంలోని నాగార్జున డిగ్రీ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతకుముందు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదురుగా ఉన్న ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐ రోడ్డు నుంచి మిర్యాలగూడ రోడ్డు మీదుగా ప్రకాశం బజార్‌‌‌‌‌‌‌‌లోని మైసయ్య విగ్రహం, క్లాక్‌‌‌‌‌‌‌‌టవర్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌జీ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐకేఎస్‌‌‌‌‌‌‌‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌ దావలె, ప్రధాన కార్యదర్శి హన్నన్‌‌‌‌‌‌‌‌ మొల్లా, జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్, ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌‌‌‌‌‌‌‌ హాజరుకానున్నారు. ఈ బహిరంగ సభకు 30 వేల మంది రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

రెండో రోజైన సోమవారం ఏచూరి గార్డెన్‌‌‌‌‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌హాల్‌‌‌‌‌‌‌‌లో ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. చివరి రోజున జరిగే ‘వ్యవసాయ సమస్యలు ఐక్య ఉద్యమాలు- ఆవశ్యకత’ సదస్సుతో మహాసభలు ముగియనున్నాయి. సభకు సంబంధించిన ఏర్పాట్లను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నాయకులు ముదిరెడ్డి సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, సయ్యద్ హాశమ్‌‌‌‌‌‌‌‌, పాలడుగు నాగార్జున, ప్రభావతి పరిశీలిస్తున్నారు.