కైసర్‌గంజ్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కాన్వాయ్ లోని ఓ కారు వేగంగా దూసుకళ్లెడంతో ఇద్దరు పిల్లలు మరణించగా మరోకరు గాయపడ్డారు. హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో గోండా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బైక్‌పై ప్రయాణిస్తున్న రెహాన్, షెహజాద్ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు కారును స్వాధీనం చేసుకుని చిన్నారుల మృతదేహాలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కరణ్ భూషణ్ కాన్వాయ్‌లో ఉన్నారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక నివేదికలో అతని పేరు ప్రస్తావించలేదు. ఫిర్యాదు ఆధారంగా కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు కారు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చర్యలు చేపట్టారు.
also read : Good Health: విటమిన్ P గురించి విన్నారా.. ఇది కూడా శరీరానికి అవసరమే
మరోవైపు.. ప్రమాదం అనంతరం ప్రజలు ఆగ్రహంతో సీహెచ్‌సీని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతుడు రెహాన్ ఖాన్ తల్లి చందాబేగం కల్నల్‌గంజ్ కొత్వాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.