ఐసీసీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసులో బుమ్రా

ఐసీసీ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేసులో బుమ్రా

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుమ్రా.. రెండు ఐసీసీ అవార్డులకు నామినేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాడు. ఐసీసీ మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్యారీ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)తో పాటు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డుల జాబితాలో అతనికి చోటు దక్కింది. సోబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పురస్కారం కోసం జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ట్రావిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) కూడా రేసులో ఉన్నారు. బెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కమింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శ్రీలంక) పోటీపడుతున్నాడు. ఈ ఏడాది 13 టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన బుమ్రా 14.92 యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 71 వికెట్లు తీశాడు.

స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 30.16గా ఉంది. ప్రస్తుతానికి ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గావస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలోనూ బుమ్రా 30 వికెట్లతో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నాడు. 31 టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడిన రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1556 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం అతనికి ఇది ఐదోసారి. బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 1100 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించి నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.

పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ట్రిపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ కూడా చేసిన బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. అత్యధిక రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విదేశాల్లోనే చేయడం విశేషం. ఇక కమింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 74.92 సగటుతో 1049 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. గతేడాది వెన్ను నొప్పి నుంచి కోలుకుని వచ్చిన బుమ్రా.. ఈ ఏడాది బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టాడని ఐసీసీ పేర్కొంది.