దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిచా ఘోష్ అద్భుతం చేసింది. వికెట్ల వెనుక నమ్మశక్యం కాని రీతిలో క్యాచ్ ను అందుకుంది. ఇన్నింగ్స్ 14 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్పిన్నర్ ఆశ శోభన వేసిన బంతిని బలంగా పాకిస్థాన్ బ్యాటర్ ఫాతిమా సనా భారీ షాట్ కు ప్రయత్నించింది. స్పిన్ బాగా తిరగడంతో ఆమెకు టైమింగ్ కుదరలేదు. బ్యాట్ కు టచ్ అయ్యి వికెట్ల వెనుక దూరంగా వెళ్తుంది.
ఈ క్యాచ్ ను వికెట్ కీపర్ రిచా ఘోష్ మెరుపు వేగంతో అందుకుంది. దూరంగా వెళ్తున్న బంతిని ఒక చేత్తో ఒడిసి పట్టుకుంది. ఆమె అందుకున్న రియాక్షన్ టైం కేవలం 0.44 సెకండ్స్ మాత్రమే. ఫాతిమా సనా తల వెనక్కి తిప్పేలోపే బంతి రిచా ఘోష్ చేతిలో పడింది. ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి క్యాచ్ లు ధోనీకి మాత్రమే సాధ్యం. రిచా ఈ క్యాచ్ అందుకొవడంతో ఆమె ధోనీతో పోలుస్తూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. మహిళా క్రికెట్ లో ఇదొక అద్భుత క్యాచ్ గా వర్ణిస్తున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 28 పరుగులు చేసిన నిదా దార్ టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి మూడు.. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. రేణుక ఠాకూర్, దీప్తి శర్మ, ఆశ శోభన లకు తలో వికెట్ లభించింది.
WHAT. A. CATCH. 🤯#RichaGhosh's superb reflexes see 🇵🇰 skipper #FatimaSana's back off #AshaSobhana's bowling! 🔥
— Star Sports (@StarSportsIndia) October 6, 2024
What total will Pakistan post? 💭
📺 Watch #WomensWorldCupOnStar 👉 #INDvPAK LIVE NOW pic.twitter.com/LoTtUc9JUA