
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం దారుణమని, తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తే ఎర్రజెండా చూస్తూ ఊరుకోదని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బృందా కారత్ హెచ్చరించారు. మహబూబాబాద్‌లో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బస్సు జాతాను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించడానికి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల పోరాట వేదిక కన్వీనర్ ఎస్. వీరయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు జి. నాగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ పాల్గొన్నారు.