ఘర్ వాపసీ కామెంట్లపై వెనక్కి తగ్గిన తేజస్వీ

ఘర్ వాపసీ కామెంట్లపై వెనక్కి తగ్గిన తేజస్వీ
  • ఉడుపి సభలో వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తేజస్వీ సూర్య 

ఉడుపి: మతం మారిన హిందువులంతా తిరిగి సొంత గూటికి రావాలని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కర్నాటకలోని ఉడుపిలో ఈ నెల 25న నిర్వహించిన ‘హిందూ రివైవల్ ఇన్ భారత్’ అనే సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. హిందూ మతాన్ని వీడిన వాళ్లందరూ తిరిగి సనాతన ధర్మంలోకి రావాలని తేజస్వీ పిలుపునివ్వడం కాంట్రవర్సీకి దారితీసింది. ఇంతకీ ఆ సభలో తేజస్వీ ఏమన్నారంటే.. ‘హిందూ మతాన్ని వీడిన వారందరినీ తిరిగి మతమార్పిడి చేయించడం ఒక్కటే హిందువుల ముందున్న ఏకైక మార్గం. స్వధర్మాన్ని వీడిన వారిని వెనక్కి రప్పించాల్సిందే. దీని కోసం ప్రతి గుడి, మఠానికి వార్షిక టార్గెట్లు పెట్టాలె’ అని ఆ సభలో తేజస్వీ అన్నారు.

బలవంతంగా, భయపెట్టి కొందర్ని హిందూ మతం నుంచి వేరే మతానికి మార్చారని.. ఇప్పుడు వారందరినీ ఘర్ వాపసీ చేయించాలని తేజస్వీ చెప్పారు. ఘర్ వాపసీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. తన ప్రసంగంలోని పలు వ్యాఖ్యలపై వివాదానికి దారి తీసినందుకు క్షమాపణలు చెప్పారు. తన కామెంట్లను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

పాములతో వీడియో షూట్.. సింగర్ ముఖంపై కాటేసిన సర్పం

కిలోల కొద్దీ బంగారం.. నోట్ల గుట్టలు సీజ్

రామ నామ స్మరణ చేయాలె.. ఒవైసీకి యూపీ మంత్రి సవాల్