నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి.. రవితేజ తండ్రి ఆవేదన

నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి.. రవితేజ  తండ్రి ఆవేదన

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో చనిపోయిన  తన కొడుకు  మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా కృషి చేయాలని  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు రవితేజ తండ్రి చంద్రమౌళి. చౌటుప్పల్ కొయ్యల గూడెం గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ ఆర్కే పురం  గ్రీన్ హిల్స్ కాలనీలో  నివాసం ఉంటున్న చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్ గా చేస్తూ   కుమారుడు రవితేజ, కూతురు ప్రీతి లను  ఉన్నత చదువుల కొరకు 2022 మార్చిలో అమెరికాకు పంపాడు. మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు

2025 జనవరి 20న వాషింగ్టన్ ఏవ్ లో  దుండగుడి కాల్పుల్లో రవితేజ చనిపోయాడు.  అమెరికా వెళ్లి, ఉద్యోగం చేస్తాడనుకున్న కుమారుడు   ఆగంతకుల కాల్పుల్లో మృతి చెందాడని  తెలిసి  తల్లిదండ్రులు చంద్ర మౌళి ,సువర్ణ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు    ఎంబసీ తో సంప్రదించి రవితేజ మృతదేహాన్ని  సాధ్యమైనంత త్వరగా  ఇండియాకు తీసుకురావాలని  తండ్రి  చంద్రమౌళి  విజ్ఞప్తి చేశాడు.