బెల్లంపల్లికి మెడికల్ కాలేజీ తెస్త : గడ్డం వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలం లోని కిష్టంపేట, అచ్చలాపూర్, తాండూర్ ఐబీలో విస్తృతంగా పర్యటించి తాండూర్ లో రోడ్డు షో, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ  ర్యాలీలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎస్. వేణుగోపాల చారి,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ..   తాను ఎంపీగా గెలిచిన తర్వాత బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానన్నారు. తనను ప్రజలు కన్న కొడుకులా భావించా ఎంపీగా గెలిపిస్తే సమస్యల పరిష్కరిస్తానన్నారు. బెల్లంపల్లి లో మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు, ఆర్టీసి బస్సు డిపో ఏర్పాటు చేసేలా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి సహకారంతో కృషి చేస్తానని చెప్పారు. తాండూర్ మండల కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ప్రజల కలలు నిజం చేస్తామన్నారు. కార్యక్రమంలో మత్తమారి సూరిబాబు, ఎండీ ఈసా, గట్టు మురళీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.