హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగానికీ తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కమ్మ సంఘంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల ఇవాళ (అక్టోబర్ 2) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహాత్మ గాంధీ జయంతి రోజు చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
Also Read :- కేటీఆర్ వల్లే నాగచైతన్య, సమంత విడాకులు
స్వాతంత్ర ఉద్యమ సమయంలో విదేశీ వస్తు బహిష్కరణ సందర్భంగా దేశ ప్రజల గౌరవాన్ని కాపాడింది చేనేత వృత్తిదారులేనని గుర్తు చేసుకున్నారు. ఆధునిక యంత్రాల ప్రవేశంతో తీవ్రతలు ఎదుర్కొంటున్న పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న చర్యలతో తోడు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.