బషీర్ బాగ్, వెలుగు: ‘ద వైర్’ను తెలుగులో తీసుకురావడం అభినందనీయమని, తెలుగు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ బారు అన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ‘ద వైర్ తెలుగు’ వెబ్సైట్ప్రారంభ సభ నిర్వహించారు. సంజయ్ బారు చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. నేటి ప్రభుత్వాల కారణంగా ఎమర్జెన్సీ నాటికంటే వంద మందికి పైగా జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ప్రధాన మీడియా విశ్వసనీయతను కోల్పోయిందని, ఇండిపెండెంట్ జర్నలిస్టులే ప్రజలకు నమ్మకమైన వార్తలు అందిస్తున్నారన్నారు. ద వైర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ మాట్లాడుతూ.. దేశంలో ధైర్యవంతమైన జర్నలిజం అవసరమని.. ద వైర్ పెట్టుబడుదారుల, రాజకీయ నాయకుల పాత్రను తొలగించి ప్రజలపై ఆధారపడే, ఉపయోగపడే జర్నలిజాన్ని నమ్ముతుందన్నారు.