బ్రిటిష్ రచయిత్రి సమంతకు బుకర్ ప్రైజ్

బ్రిటిష్ రచయిత్రి సమంతకు బుకర్ ప్రైజ్

లండన్: బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే 2024 బుకర్ ప్రైజ్​ గెలుచుకున్నారు. ఆమె రాసిన ‘ఆర్బిటల్’ నవల ను ఈ ప్రైజ్ వరించింది. ఐఎస్ఎస్ లో పరిశోధనల కోసం వెళ్లిన ఆరుగురు వ్యోమగాములు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులపై రాసిన నవల ఇది. అంతరిక్షం కేంద్రంగా రాసిన నవలకు ఇంత పెద్ద బహుమతి రావడం ఇదే తొలిసారి. ప్రైజ్  మనీగా సమంతకు రూ.53 లక్షలు ఇస్తారు. బుకర్ ప్రైజ్​కు షార్ట్ లిస్ట్  అయిన తర్వాత ‘ఆర్బిటల్’ నవల యూకేలో అత్యధికంగా అమ్ముడైంది. కాగా.. ఈ ఏడాది బుకర్ ప్రైజ్  విజేతగా తన పేరును ప్రకటించడంపై సమంత హర్షం వ్యక్తం చేశారు.