గ్రేట్ జాబ్: నిమ్స్​లో చిన్నారులకు వైద్య సేవలు భేష్: బ్రిటీష్ ​డిప్యూటీ హైకమిషనర్

గ్రేట్ జాబ్: నిమ్స్​లో చిన్నారులకు వైద్య సేవలు భేష్: బ్రిటీష్ ​డిప్యూటీ హైకమిషనర్
  • బ్రిటీష్ ​డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్

పంజాగుట్ట, వెలుగు: మానవతా దృక్పథంతో నిమ్స్ లో చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అభినందించారు. గురువారం ఆయన నిమ్స్ ను సందర్శించారు. 

హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు నాలుగు రోజులుగా బ్రిటన్​డాక్టర్​దన్నపునేని రమణ, నిమ్స్​కార్డియోథోరాసిక్​విభాగాధిపతి డాక్టర్​అమరేశ్వరరావు నేతృత్వంలో డాక్టర్లు ఉచితంగా సర్జరీలు చేయడాన్ని మెచ్చుకున్నారు. 

మిలినియమ్ బ్లాక్​లోని పీడియాట్రిక్​గుండె విభాగాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు11 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. గురువారం మరో నలుగురికి ఆపరేషన్లు జరిగాయి.