Nani, Gareth Wynn Owen: హీరో నానితో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్.. ఏ సినిమా చూడాలో చెప్పండి!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని(Nani)తో  తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న  గారెత్ విన్ ఓవెన్(Gareth Wynn Owen) భేటీ అయ్యారు. సోమవారం ఉదయం హీరో నాని ఇంట్లో కలుసుకున్న ఈ ఇద్దరు చాలాసేపు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని  గారెత్ విన్ ఓవెన్ త సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో పంచుకున్నారు.

ఇందులో భాగంగా  గారెత్ విన్ ఓవెన్ హీరో నాని గురించి మాట్లాడుతూ.. నానిని కలవడం చాలా ఆనందనంగా ఉంది. ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి చాలా ప్రశ్నలు అడిగితెలుసుకున్నాను. అంతేకాదు.. తెలుగుచిత్ర పరిశ్రమతో బ్రిటీష్  సంబంధాలను ఎలా ప్రతిష్టం చేసుకోవాలి అనే విషయాల గురించి చర్చించాము. ఆయన కూడా చాలా మని సజెషన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. తాను హీరోగా చేసిన రెండు సినిమాలను చూడమని సజెస్ట్ చేశారు. మీరు చెప్పండి నేను నాని ఏ ఏ సినిమాకు చూడాలి. అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చుసిన నెటిజన్స్ ఆయనకు నాని సూపర్ హిట్ సినిమాలు సజెస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గారెత్ విన్ ఓవెన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా అంతగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తరువాత ఓజీ దర్శకుడు సుజిత్ తో ఒక క్రైమ్ కామెడీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

ALSO READ | Save The Tigers 2: సేవ్ ది టైగెర్స్ సీజన్ 2కి సూపర్ రెస్పాన్స్.. సీజన్ 1కి మించి