ప్రపంచీకరణ ఇక ముగిసినట్టే!..బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

 ప్రపంచీకరణ ఇక ముగిసినట్టే!..బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్

న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ఇక ప్రపంచీకరణ ముగిసినట్లేనని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించనున్నారు. సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ఆయన ఈ మేరకు ప్రకటన చేయనున్నట్టు టైమ్స్’ మీడియా పేర్కొంది. ‘‘వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఇక ముగిసినట్టే” అని స్టార్మర్ ప్రకటించనున్నట్టు తెలిపింది. 

ఆర్థిక జాతీయవాదం విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఆయన కూడా అంగీకరిస్తున్నారని చెప్పింది. ‘‘చాలామంది శ్రామికులకు ప్రపంచీకరణ అనుకూలంగా ఉండదు. అయితే దానికి ట్రేడ్ వార్ సమాధానమని మేం అనుకోవడం లేదు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించేందుకు ఇదొక అవకాశం. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడంపై దేశాలు ఫోకస్ పెడతాయి” అని స్టార్మర్ పేర్కొన్నట్టు ‘టైమ్స్’ వెల్లడించింది.