సీటీలో అఫ్గాన్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ వద్దు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును కోరిన 

సీటీలో అఫ్గాన్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ వద్దు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును కోరిన 
  • ఆ దేశ రాజకీయ నాయకులు

లండన్‌‌‌‌ : చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ (సీటీ)లో భాగంగా అఫ్గానిస్తాన్‌‌‌‌తో జరిగే మ్యాచ్‌‌‌‌ను బాయ్‌‌‌‌కాట్‌‌‌‌ చేయాలని ఇంగ్లండ్‌‌‌‌కు చెందిన 160 మంది రాజకీయ నాయకులు ఆ దేశ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ని కోరారు. ఈ మేరకు వాళ్లంతా సంతకం చేసిన ఓ లేఖను విడుదల చేశారు. తాలిబాన్‌‌‌‌ పాలనలో మహిళల హక్కులకు భంగం వాటిల్లుతోందని, అందుకే మ్యాచ్‌‌‌‌ను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పట్నించి అఫ్గాన్ క్రీడల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా తగ్గిపోయిందని గుర్తు చేశారు. ఈ చర్య ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఫిబ్రవరి 26న లాహోర్‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌, అఫ్గాన్‌‌‌‌ మధ్య మ్యాచ్‌‌‌‌ జరగనుంది.