కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సిందే

కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సిందే

పుతిన్​కు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ హెచ్చరిక

లండన్: అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విమరణను ఒప్పుకోకుండా రష్యా శాంతితో ఆటలాడితే తాము అనుమతించబోమని యూకే పీఎం కీర్​స్టార్మర్​ వార్నింగ్ ఇచ్చారు. సీజ్​ఫైర్​ను రష్యా ప్రెసిడెంట్​ పుతిన్ సీరియస్​గా తీసుకోవట్లేదన్నారు. 

రష్యా–ఉక్రెయిన్​ మధ్య శాంతిని నెలకొల్పాలని అమెరికా ప్రెసిడెంట్​​ట్రంప్ ప్రయత్నిస్తుంటే.. పుతిన్​ పట్టించుకోవడంలేదని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆలస్యం చేయాలని చూస్తున్నారని ఫైర్​ అయ్యారు. దీన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. 

యురోపియన్ ​యూనియన్, నాటో దేశాలు దీనికి కట్టుబడి ఉంటాయని తాము భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘శాంతిని నెలకొల్పాలని పుతిన్​ భావిస్తే.. ఉక్రెయిన్​పై చేస్తున్న అనాగరిక దాడులను వెంటనే ఆపేయాలి. సీజ్​ఫైర్​కు అంగీకరించాలి. ప్రపంచం మొత్తం గమనిస్తున్నది” అని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా అంగీకరించకుంటే ఆ దేశంపై ఆర్థిక ఒత్తిడిని పెంచి.. దారికి తేవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అలాగే, రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతూ తనను తాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్​కు సైనిక సాయం అందించాలని అన్నారు