
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఇన్ స్టాగ్రమ్ లో పరిచయం అయిన యువకుడిని కలిసేందుకు బ్రిటన్ నుంచి వచ్చిన మహిళపై హోటల్లో అత్యాచారం జరిగింది.ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న కైలాష్ తో 2025 ఫిబ్రవరి లో ఇన్ స్టాలో బ్రిటన్ కు చెందిన మహిళకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. అయితే ఆ మహిళ హాలిడేస్ లో మార్చి 7న గోవా,మహారాష్ట్ర టూర్ కు వచ్చింది. తన దగ్గరకు రావాలని కైలాష్ కు ఫోన్ చేసింది. అయితే తాను గోవాకు రాలేనని..ఢిల్లీకే రావాలని మహిళను కోరాడు. దీంతో మార్చి 11న ఢిల్లీకి చేరుకుని మహిపాల్ పూర్ లోని ఓ హోటల్ లో ఉంది. వెంటనే ఆమె కైలాష్ కు ఫోన్ చేయగా అతను తన ఫ్రెండ్ వసీంతో కలిసి హోటల్ కు వెళ్లారు. ఆ రాత్రి ఆమెపై కైలాష్ అత్యాచారం చేయగా..తన ఫ్రెండ్ లైంగికంగా వేధించాడు.
ALSO READ | బైక్ పార్కింగ్‌పై గొడవ: యంగ్ సైంటిస్టును కొట్టిచంపిన పక్కింటి వ్యక్తి
వారి నుంచి తప్పించుకున్న మహిళ మరుసటి రోజు వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు కైలాష్ తో పాటు తన ఫ్రెండ్ ను అరెస్ట్ చేశారు.. కైలాష్ కు ఇంగ్లీష్ రాదని..తనతో మాట్లాడేందుకు గూగుల్ ట్రాన్స్ లేట్ ను వాడినట్లు మహిళ పోలీసులకు తెలిపింది. ఈ ఘటన గురించి పోలీసులు భారత్ లోని బ్రిటీష్ హైకమిషనర్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.